29
తుంగతుర్తి ముద్ర:- సూర్యాపేట జిల్లా జాతీయ హక్కుల కమిషన్ చైర్మన్ గా తుంగర్తి మండల కేంద్రానికి చెందిన గోపగాని రమేష్ గౌడ్ నియమిస్తూ హైదరాబాద్ లోని తెలంగాణ సారసత్వ పరిషత్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఎన్సీఆర్సీ జాతీయ చైర్మన్ డాక్టర్ ఎంవీఎల్.నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ నియామాక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేసే సమయంలో ఎలాంటి అన్యాయాలకు గురికాకుండా తగిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారులు మోసపోతే కన్స్యూమర్ ప్రోటెంక్షన్ రైట్ యాక్ట్ వినియోగించుకొని న్యాయం పొందాలన్నారు. తన నియామకానికి సహకరించిన కన్స్యూమర్ రైట్ కమిషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.