20
తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. డిపార్ట్మెంట్లో ఆందోళనలను ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు మొత్తం 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుల్స్ పై ఆర్టికల్ 311 మేరకు సస్పెన్షన్ వేటు వేసింది. 3,4,5,17వ బెటాలియన్లలో ఆరుగురు చొప్పున, 6,12, 13వ బెటాలియన్లలో ఐదురుగు చొప్పున సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. పోలీస్‌లో ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారని అందుకే సిబ్బందిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసినట్లుగా ప్రకటించారు.