భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గల అంగన్వాడి కేంద్రానికి వచ్చే చిన్నారులకు మురుగు నిరుత్సాహం తప్పడం లేదు. అంగన్వాడి కేంద్రానికి అనుకొని మురుగునీరు నిల్వ ఉండటంతో భయంకరమైన దుర్వాసన వెదజల్లుతుంది .దీంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు మాకేమీ పట్టింపు లేనట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. మురుగు నిల్వ కారణంగా దోమల బెడద ఎక్కువ అవుతుందని, చిన్నారులు రోగాల బారిన పడతారేమోనని తల్లిదండ్రులు పిల్లలను అంగన్వాడి కేంద్రానికి పంపించాలంటేనే జంకుతున్నారు .తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మురుగునీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.