23
ముద్ర,తెలంగాణ:- సుప్రీం కోర్టు తీర్పును వెలువరించిన వెంటనే.. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి. ఇది చాలా గొప్ప తీర్పన్న రేవంత్.. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
ధర్మాసనం తీర్పునకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణను ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే జారీ చేసిన జాబ్ నోటిఫికేషన్లకు కూడా మాదిగ, మాల ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఈ మేరకు అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని రేవంత్ పేర్కొన్నారు.