గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సూపర్ సిక్స్ పేరుతో కూటమి నాయకులు పలు హామీలను ఇచ్చారు. ఇందులో కీలకమైన హామీ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ. గడిచిన కొద్దిరోజులుగా ప్రభుత్వంపై ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారంటూ తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకం దీపావళి నుంచి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఈ పథకం అమలకు కీలకమైన అప్డేట్ ను ప్రభుత్వం అందించింది. రాష్ట్రంలో 1.40 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తారు. తొలి విడత దీపావళి పండుగకు ముందే ఉచిత గ్యాస్ సిలిండర్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకు సంబంధించి ఈ 29 నుంచి ఉచిత గ్యాస్ పథకం బుకింగ్స్ ప్రారంభం కాను నెలలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఏర్పాటు. ఈ నెల 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు లబ్ధిదారులకు ఉంటుంది.
గ్యాస్ కనెక్షన్ ఉండి, తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డు ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులు. అర్హత ఉన్న ప్రతి కుటుంబం అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్ తీసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ అందిన వెంటనే డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో ప్రభుత్వం తిరిగి డివిటి ద్వారా నగదు వెనక్కి ఇవ్వనుంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే 1967 నంబర్‌కు కాల్ చేసి సేవలు పొందేందుకు మంత్రి వ్యక్తి. ఎక్కువ మందికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఒక పాయింట్ 47 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీలను అమలు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు మంత్రి. ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల అదనపు భారం పడనుంది. మిగిలిన రెండు గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు ఎప్పుడు ఇస్తామన్న దానిని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. తొలి విడత గృహం మాత్రం దీపావళి పండుగ నుంచే ప్రారంభం. ఇప్పటికే లబ్ధిదారులు ఈ గృహోపకరణాల నుండి ప్రారంభిస్తారు అంటూ ఆశగా ఉన్నారు. తాజాగా ప్రభుత్వం కీలకమైన ప్రకటనతో లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సన్న వడ్లకు అదనంగా బోనస్ ప్రకటన.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
చర్లపల్లి రైల్వే స్టేషన్ | ఎయిర్‌పోర్టులను తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్