Home సినిమా బాలకృష్ణకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌… 500 ఎకరాల భూమి కేటాయింపు? – Sneha News

బాలకృష్ణకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌… 500 ఎకరాల భూమి కేటాయింపు? – Sneha News

by Sneha News
0 comments
బాలకృష్ణకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌... 500 ఎకరాల భూమి కేటాయింపు?


హైదరాబాద్‌లోని అతి పెద్ద సినీ స్టూడియో రామోజీ ఫిలింసిటీ. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్‌గా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఇది కాక అన్నపూర్ణ, సారధి, పద్మాలయ, రామానాయుడు, రామకృష్ణ, అల్లు స్టూడియో.. ఇలా సినిమాల నిర్మాణం అనేక స్టూడియోలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నందమూరి బాలకృష్ణ ఓ స్టూడియో నిర్మాణ వార్త శ్రీకారం చుడుతున్నారన్నది. బాలకృష్ణ ఏపీలోని హిందూపూర్ ఎమ్మెల్యే. అక్కడ కూటమి అధికారంలో ఉంది. తెలంగాణలోనే స్టూడియో నిర్మించాలని బాలకృష్ణ అనుకుంటున్నారని సమాచారం. ఈ కోరనే తెలంగాణలోని రేవంత్‌రెడ్డి సర్కార్‌.. బాలయ్యకు ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిందని తెలుస్తోంది. స్టూడియో నిర్మాణానికి 500 ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు సమాచారం అందుతోంది. ఈ భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ముందస్తు శాఖ ఆమోదముద్ర వేసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపినట్లు సమాచారం.

శనివారం జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నగర శివారు ప్రాంతంలో ఈ స్టూడియోకు భూమి కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో స్టూడియోల నిర్మాణాలకు స్థలాలు కేటాయిస్తానని వై.ఎస్.జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో బాలయ్యకు జగన్‌ ప్రభుత్వం 500 ఎకరాల భూమి ఇవ్వబోతోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం బయటికి రాలేదు. ఇప్పుడు తెలంగాణలో బాలకృష్ణ స్టూడియో నిర్మిస్తారని వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది.

నందమూరి తారక రామారావు 1976లో రామకృష్ణ సినీ స్టూడియోస్‌ను నిర్మించారు. ‘దానవీరశూర కర్ణ’ చిత్రంతో ఈ స్టూడియో. 2000 సంవత్సరం వరకు అక్కడ షూటింగ్‌లు జరిగాయి. ఎక్కువగా ఎన్టీఆర్, బాలకృష్ణ నటించిన సినిమాల షూటింగ్స్ మాత్రమే అక్కడ జరిగేవి. పాతిక సంవత్సరాలుగా అక్కడ షూటింగ్‌లు జరగడం లేదు. బాలకృష్ణకు స్టూడియో నిర్మించాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే త్వరలోనే అది కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech