Home తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలి.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలి.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలి.. - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • పది లో పదికి పది వచ్చేలా విద్యార్ధులకు మంచి బోధన అందించాలి..
  • పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
  • నాణ్యమైన విద్య అందించాలి
  • విద్యార్ధులకు మంచి అలవాట్లు నేర్పించాలి
  • విద్యార్థుల గదులు శుభ్రంగా ఉంచుకోవాలి

నాగర్ కర్నూల్ : జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ,గురువారం కొల్లాపూర్ వారికి సింగోటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కొనసాగుతున్న వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా రిజిష్టర్లను పరిశీలించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు ,హాజరు శాతాన్ని పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడితో అడిగి తెలుసుకున్నారు..

జిల్లా కలెక్టర్ వంట గదిని నిర్ణీత సరుకులు, వండే ప్రదర్శన గమనించారు. భోజనంపై దృష్టి పెట్టాలని వంట నిర్వాహకులకు సూచించారు. మధ్యాహ్నం బిల్లులు కూడా సకాలంలో అంద భోజనం అందించబడింది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని రుచికరంగా నాణ్యతలు పాటిస్తూ మధ్యాహ్న భోజనాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులతో కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న 97 మంది విద్యార్థుల ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని హెచ్‌ఎంకు సూచించారు. పదిలో పదికి పది వచ్చేలా విద్యార్ధులకు మంచి బోధన అందించాలి, విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. విద్యార్థుల జీవితాలకు మార్గం చూపేలా బోధన సాగాలని తెలిపారు.

సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు. జిల్లా కలెక్టర్ విద్యార్ధులతో ముచ్చటిస్తూ బాగా చదువుకోవాలని, పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, అందుకు ఇప్పటి నుండే బాగా చదవాలని, ఏ సబ్జెక్టులో నైన వెనుకబడి ఉంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.
కలెక్టర్ వెంట కొల్లాపూర్ ఆర్డీవో నాగరాజ్, కొల్లాపూర్ తహసిల్దార్ విష్ణువర్ధన్, ఎంపీడీవో మనోహర్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శోభారాణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవింద్ గౌడ్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ విష్ణు, ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech