లోకల్ పోలీసులతో కలిసి హెచ్ న్యూ పోలీసులు జైంట్ ఆపరేషన్ నిర్వహించి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్ ఫెడ్లర్‌తో పాటు అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుమయూన్‌నగర్, హెచ్ న్యూ పోలీసుల జైంట్ ఆపరేషన్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.
విదేశీ డ్రగ్ పెడ్లర్ నుంచి 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కంచన్‌బాగ్ పోలీసులకు మరో అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్ చిక్కాడు. అతని వద్ద నుంచి 80 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 25 లక్షల విలువైన డ్రగ్స్‌ను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీడియా ముందుకు ఇంటర్నేషనల్ డ్రగ్ ఫెడ్లర్, అంతర్రాష్ట్ర డ్రగ్ ఫెడ్లర్‌ను హాజరుపర్చనున్నారు.