Home తెలంగాణ ఖమ్మం, వరంగల్ రైల్వే అలైన్ మెంట్ మార్చండి! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

ఖమ్మం, వరంగల్ రైల్వే అలైన్ మెంట్ మార్చండి! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
ఖమ్మం, వరంగల్ రైల్వే అలైన్ మెంట్ మార్చండి! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • దక్షిణమధ్య రైల్వే జిఎంతో మంత్రి పొంగులిటీ శ్రీనివాస్ రెడ్డి భేటీ

ముద్ర, తెలంగాణ బ్యూరో:- ఖమ్మం, వరంగల్ మీదుగా దక్షిణ మద్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లో అలైన్ మెంట్ లో మార్పులు చేర్పులు చేసి జిల్లా హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనరల్ మద్య రైల్వే మేనేజర్ అరుణ్ జైన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం నాడు రైలు నిలయం లో జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో ఆయన సమావేశం అయ్యారు. డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయక్ గూడెం మీదుగా సూర్యపేట జిల్లా మోతే నుండి గద్వాల్ వరకు ప్రతిపాదించిన నూతన రైల్వే మార్గం ఖమ్మం జిల్లా తన నియోజకవర్గం పాలేరులోని నాలుగు మండలాల మీదుగా ఈ రైల్వే మార్గం వెళుతుంది. దీనివల్ల సాగు భూమలను రైతులు కోల్పోవలసి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా అలైన్ మెంట్ లో మార్పుచేసి మరో మార్గములో రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటి (కుడా) మాస్టర్ ప్లాన్ ను పరిగణలోకి తీసుకొని వరంగల్ నగర బైపాస్ రైల్వే లైన్ ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ నగర అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2050 కి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేస్తున్నామన్నారు. ఈ నేపద్యంలో రైల్వే శాఖ నష్కల్ నుండి హసన్ పర్తి, నష్కల్ చింతలపల్లి వరకు కొత్తగా నిర్మించతలపెట్టిన రైల్వే మార్గాన్ని వరంగల్ మాస్టర్ ప్లాన్ కు అనుసందానం చేయడం జరిగింది. ప్రస్తుతం సిద్దం చేసిన రైల్వే మార్గం వల్ల వరంగల్ మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అలైన్ మెంట్ మార్చాలని జిఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశములో ఆర్ బి శాఖ, ప్రత్యేక కార్యదర్శి హరి చందన కొనసాగుతుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech