ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లో నూతనంగా నిర్మించతలపెట్టిన ఫోర్త్ సిటీలో గోల్ఫ్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గోల్ఫ్ సిటీ ఏర్పాటు వలన సుమారు పది వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుందని ఆయన ఉన్నారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్ బాబుతో యూఎస్ ఏలోని ఫ్రిస్కోకు చెందిన ప్రోఫెషనల్ గోల్ఫర్స్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా (పీజీఏ), స్టోన్ క్రాఫ్ట్ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు.
ఫోర్త్ సిటీలో గోల్ఫ్ కోర్టులు, ఎంటర్ టైన్ మెంట్ హబ్‌లు, హోటళ్ళు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేసేందుకు పీజీఏ, స్టోన్ క్రాఫ్ట్ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. ఫోర్త్ సిటీలో ఎలాంటి కాలుష్యం వెలువడని నెట్ -జీవో సిటీని నిర్మిస్తామని ఆయన చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబుతో జరిగిన ఈ భేటీలో స్టోన్ క్రాఫ్ సీఈవో చిలుకూరి కీర్తి, పీజీఏ ప్రతినిధులు టీం ల్యాబ్, డేవిడ్ బ్లమ్, అలెక్స్ హే, కెన్ సాగర్, రాధా కిశోర్ ఉన్నారు.