Home తాజా వార్తలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫాంహౌజులను మట్టడిస్తం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫాంహౌజులను మట్టడిస్తం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫాంహౌజులను మట్టడిస్తం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • మూసీ పునరుజ్జీవనాన్నిఅడ్డుపడితే ఊరుకోం
  • లక్షలాది మందితో తరలివచ్చి నల్గొండ తడాఖా చూపిస్తాం
  • పదేండ్ల కింద్ర కూలిపోయిన కాళేశ్వరం డీపీఆర్ కు రూ. 33 కోట్లు చెల్లించి మాపై గగ్గోలులా..?
  • మూసీ డీపీఆర్ చేసిన మెయిన్ హార్డ్ టీ కంపెనీపై కేటీఆర్ వి అసత్య ఆరోపణలు
  • కాళేశ్వరం డీపీఆర్ చేసిన వ్యాప్కోస్ ను ఒరిస్సా, గుజరాత్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు
  • కేటీఆర్ స్నేహితుని కంపెనీ గ్లోబరీనాతో పదుల సంఖ్యలో విద్యార్ధుల మరణాలు
  • పదేండ్లు ఎస్సెల్బీసీ సొరంగం పడావుపెట్టి నల్గొండను కేసీఆర్ నాశనం చేసిండు
  • డబ్బుందనే అహంకారంతో మోదీ, రేవంత్ రెడ్డిపై రెచ్చిపోతున్న కేటీఆర్
  • కేసీఆర్ – కేటీఆర్ రాజకీయాల కోసం నల్గొండ ప్రజలు బలికావాలా..?
  • మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో దాదాపు కోటిమంది ప్రజల జీవితాలతో ముడిపడ్డ మూసీ శుద్ధీకరణను అడ్డుకుంటే ఆనాటి రజాకార్లపై తిరుగుబాటు, తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమం మళ్లీ పునరావృతం అవుతుందని రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. అవసరమైతే లక్షాలాది మందితో వచ్చి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫాంహౌజులను మట్టడిస్తామన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకుంటే.. గడిచిన పదేండ్లలో నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన బీఆర్ఎస్ నేతలపై. నల్గొండ ప్రజలను నాయకులు రెచ్చగొడ చెబుతున్న కేటీఆర్ మాటలు పూర్తిగా సత్యదూరమని చెప్పిన ఆయన.. నల్గొండ ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకులు కాదని.. స్వతహాగా పౌరుషం ఉన్న వ్యక్తులమన్నారు. మూసీకి అడ్డుపడే ప్రతీ రాజకీయ పార్టీని నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ లో ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారని హెచ్చరిక.

మూసీ కాలుష్యంతో ప్రజలు క్యాన్సర్, నరాల జబ్బులు, గుండె, కిడ్నీలు పాడైపోవడం, పిల్లల్లో పెరుగుదల, కంటి సమస్యలు, చర్మవ్యాధులతో నానా అవస్థలు పడుతున్నారని.. ఇంకా వాళ్లు చచ్చిపోవాలని కేటీఆర్ కోరుతున్నారు. కేసీఆర్ మోసాలకు ఇప్పటికే నల్గొండ నరకయాతన పడుతున్నదని.. ఇప్పుడు ఆయన కొడుకు మోపయ్యాడని ఆక్షేపించారు. ఎవ్వరు అడ్డువచ్చిన మూసీ విషయంలో వెనకడుగువేస్తే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. మూసీ డీపీఆర్ చేసిన మెయిన్ హార్డ్ టీ కంపెనీ 29 దేశాల్లో అద్భుతమైన కట్టడాలను కట్టిందని ఎక్కడో పాకిస్థాన్ లో కేసు అయ్యిందని.. మూసీపై అవినీతి బురదజల్లడం దారుణమన్నారు. కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం డీపీఆర్ ను తయారు చేసిన వ్యాప్కోస్ ను ఒరిస్సా గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. గుజరాత్ లో నిషేధించామని మంత్రి చెప్పారు. కేటీఆర్ బంధువుల గ్లోబరిన పదుల సంఖ్యలో విద్యార్ధుల ప్రాణాలను బలిగొన్న కేటీఆర్ ప్రజలకు ఎందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చెప్పలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం డీపీఆర్ కు 2015 లోనే రూ. 33 కోట్లు చెల్లించారని.. ఇప్పుడు రూ. 140 కోట్లు చెల్లిస్తే గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మూసీ డీపీఆర్ పూర్తికాకముందే ఎందుకు లక్షల కోట్లని ఎగిరెగిరి పడుతున్నాడని ప్రశ్నించిన ఆయన.. కేటీఆర్, హరీష్ రావు అమెరికాకు పోయి ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.

మిషన్ భగీరథలో రూ.5 వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం అవినీతి వల్ల ఇప్పటికి అనేక గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లే తాగినట్లు ఆయన తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను మార్చుకున్న వాళ్లకు ప్రతీది ఏటీఎంలాగే కనిపిస్తున్నాయని చురకలు అంటించారు. ఆ దోపిడి యావ నుంచి బయటికి రాలేకనే అన్నిట్లో అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రూ. 2 వేల కోట్లు పెట్టి 9 నాలుగేళ్లలో ఎస్.ఎల్.బీ.సీ సొరంగం పని చేస్తే నేడు నాలుగు లక్షల ఎకరాల నల్గొండ భూములు బంగారు మాగాణంగా మారేవన్నారు. అలాగే ఫ్లోరైడ్ ఇబ్బందులు తప్పవన్నారు. ఎస్.ఎల్.బీ.సీ సొరంగం పూర్తి అయితే శ్రీశైలంలో డెడ్ స్టోరీజీ ఉన్నా నల్గొండకు నీటి కొరత ఉండేది కాదన్నారు. అంతేకాదు, పులిచింతకు నీళ్లను సీమాంధ్రులకు తరలిస్తుంటే అక్కడి మోటర్లను తగులబెట్టానని.. ఆ విషయం అందరికి తెలిసిన మంత్రి.. ఎస్.ఎల్.బీ.సీ సొరంగం మంజూరీ చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వై.యస్. రాజశేఖర్ రెడ్డికి తేల్చిచెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఆనాడు పోరాడి ప్రాజెక్టును మంజూరీ చేసి 80 శాతం పనులు పూర్తి చేస్తే.. కేవలం 11 పనులకు పదేండ్లు సరిపోకపోవడం అంటే.. నల్గొండపై వారికున్న సవతితల్లి ప్రేమకు నిదర్శనమన్నారు.

బ్రాహ్మణవెల్లంల, శివన్నగూడెం, పూర్తిచేస్తే మరింతగా రైతులకు ఉపయోగం అవుతుందన్న మంత్రి నల్గొండలో బోర్ వేస్తే నీరు పసుపు రంగులో వస్తున్న విషయం ప్రపంచమంతా తెలుసు. ఆగష్టులో కేంద్ర పర్యావరణ సంస్థ మూసీలో ప్రమాదకర స్థాయిలో హెవీస్ ఉందని చెప్పిన కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మంత్రుల అందరం కలిసి సీఎంతో చర్చించి మూసీకి పరిష్కారం చూపాలని కోరారు. కోటిమంది తెలంగాణ బిడ్డల బతుకులు బాగు చేసేందుకే మూసీ శుద్ధీకరణను తీసుకున్నామని వివరించారు. కేసీఆర్‌ సీఎం అయిన మూసీలో ఫ్లోరిన్‌తో పాటు, ఇతర హెవీ రికార్డులు పెరిగాయని కేంద్రప్రభుత్వ సంస్థ తేల్చిన విషయం కేటీఆర్‌కు తెలియదా అని మంత్రి ప్రశ్నించారు. ఎస్టీపీల ద్వారా రెండుమూడు దశల్లో ట్రీట్‌మెంట్ చేసినప్పటికి వందశాతం హెవీమెటల్స్ ను తీసివేయలేమని ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు చెబితే ఎస్టీపీ ద్వారా నల్గొండకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నించామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech