యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)గత నెల సెప్టెంబర్ 27 న దేవర(దేవర)తో పాన్ ఇండియా లెవల్లో అడుగుపెట్టాడు.చాలా ఏరియాల్లో సరికొత్త రికార్డులని నెలకొల్పిన దేవర ఓవర్ ఆల్ గా ఐదు వందల కోట్ల రూపాయల గ్రాస్ ని వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఎన్టీఆర్ కూడా ఈ విషయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఒక నోట్ ని కూడా రిలీజ్ చేసాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ(koratala siva)దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ నిర్మించారు.
తాజాగా దేవర ఓటి రిలీజ్ డేట్ మీద సోషల్ మీడియాలో సరికొత్త వార్తలు వినిపిస్తున్నాయి.నెట్ ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుందని, ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. థియేటర్ రిలీజ్ అయిన ఆరు వారాల తర్వాత దేవర రిలీజ్ అవ్వాలనే ఒప్పందం గురించి గతంలో వార్తలు వచ్చాయి. ఫ్యాన్స్ కూడా యాభై రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నారు. మరి ఆ తర్వాతే ఓటిటి లోకి వస్తుందా లేక ముందుగానే వస్తుందా అనే విషయంలో రోజులైతే గాని క్లారిటీ రాదు.
ఇక దేవర మొదటి పార్ట్ విజయంతో రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఉన్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి. కొరటాల శివ ఇటీవల జరిగిన దేవర సక్సెస్ మీట్ లో మాట్లాడటం మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ చాలా పవర్ ఫుల్ గా ఉందని చెప్పుకొచ్చాడు.