Home సినిమా అకౌంట్ లో ఎంత పడ్డాయో చెప్పాల్సిందే తమన్నా – Sneha News

అకౌంట్ లో ఎంత పడ్డాయో చెప్పాల్సిందే తమన్నా – Sneha News

by Sneha News
0 comments
అకౌంట్ లో ఎంత పడ్డాయో చెప్పాల్సిందే తమన్నా


కొంత మంది హీరోయిన్లకి పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.అలాంటి వాళ్ళల్లో మిల్క్ బ్యూటీ తమన్నా(tamannaah)కూడా ఒకటి. మంచు మనోజ్(మంచు మనోజ్)హీరోగా వచ్చిన శ్రీ అనే మూవీతో తెలుగు తెరకి పరిచయమైన తమన్నా ఆ తర్వాత అగ్ర హీరోలందరితో జోడి కట్టి టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది.ప్రెజంట్ సోలో హీరోయిన్ గా తన హవా తగ్గినా కూడా ఐటెం సాంగ్స్ లో తన సత్తా చాటుతుంది. తమన్నా ఐటెం సాంగ్ ఉంటే సినిమా హిట్ అనే క్రెడిట్ కూడా పొందింది.

రీసెంట్ గా ఆమె భారతదేశంలో జరిగే ఆర్థిక నేరాలపై విచారణ జరిపే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ed)ఎదుట హాజరయ్యారు. తమన్నా ఇంతకుముందు మహాదేవ్ ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ కి ప్రమోటర్ గా వ్యవహరించడంతో పాటుగా ఆ సంస్థ నిర్వహించిన ఈవెంట్ కు కూడా హాజరయ్యారు.ఆ తర్వాత క్రిఫ్టో కరెన్సీ పేరుతో యాప్ నిర్వాహకులు పలువురిని మోసం చేశారు.ఈ యాప్ కి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ ఇచ్చారు. లేదు.చట్టాలను ఉల్లంగిస్తు నిర్వహించే అనధికార యాప్ లకి ప్రచారం చేయడం నేరం.ఈ కారణం చేతనే తమన్నాని అస్సాంలోని గౌహతిలో ఈడీ విచారించింది. గురువారం మధ్యాహ్నం 1:25 గంటలకు తమన్నా ఈడీ కార్యాలయానికి రాగా సుధీర్ఘంగా విచారించినట్లుగా ఉంది.

తమన్నాతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా వెంటవచ్చారు. తల్లి బయటే కారులో ఉండగా తండ్రి ఆమెతో పాటుగా ఆఫీస్ లోపలకి వెళ్లారు. .తమన్నా ప్రస్తుతం తెలుగులో ఓదెల 2 అనే మూవీ చేస్తుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలోశివుడ్ని ఆరాధించే శివ శక్తి క్యారక్టర్ లో కనపడబోతుంది.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech