Home తెలంగాణ మూడు నెలలు మూసీ పక్కన ఉండండి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

మూడు నెలలు మూసీ పక్కన ఉండండి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
మూడు నెలలు మూసీ పక్కన ఉండండి - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • అలా చేస్తే ఆ ప్రాజెక్టును ఆపేస్తా
  • విపక్ష, మిత్రపక్షాలకు సీఎం రేవంత్ సవాల్
  • మీ మెదడులో మూసీ కన్నా ఎక్కువ విషం
  • మూసీ పక్కన ఉండి రాజకీయాలు చేయండి
  • మూసీ పునరుజ్జీవం కోసం 33 బృందాల అధ్యయనం
  • మూసీ సుందరీకరణ కాదు.. అదో పునరుజ్జీవనం
  • మేం అద్దాల కోసం.. అందాల భామల కోసం పని చేయడం లేదు
  • మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని చూస్తోన్న విపక్ష, మిత్ర పక్ష నేతలు ఆ నది పరివాహక ప్రాంతంలో మూడు నెలల పాటు ఉండి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అలా చేస్తే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు ఆలోచనను విరమించుకుంటానని స్పష్టం చేశారు. తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదని, ఆ నది పునరుజ్జీవనమన్నారు. మూసీ పరివాహకంపై అధ్యయనం చేసిన 33 బృందాలు అక్కడ నివసిస్తోన్న ప్రజల దుర్భర జీవితాలపై నివేదిక ఇచ్చాయి. వారు ఇచ్చిన నివేదికలు, సాక్షాత్కరిస్తోన్న పరిస్థితులను పరిశీలించిన తర్వాత వారికి మెరుగైన జీవితం అందించడానికి నిర్ణయానికి వచ్చామన్నారు. కొందరి మెదడుల్లో మూసీలో ఉన్న మురికి ఎక్కువ విషం లేదని, అందుకే ఈ ప్రాజెక్టుపై దుష్ప్రచారం కంటే విపక్షాలపై ధ్వజమెత్తారు. తాము అద్దాల కోసం.. అందాల భామల కోసం పని చేయడం లేదన్న సీఎం రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును చేపట్టామన్నారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి నది అభివృద్ధి, సుందరీకరణ వివరాలు.

మూసీ నది గర్భంలో 1600కు పైగా నివాసాలు ఉన్నాయన్న సీఎం తాము ఉన్నపళంగా, నిర్దయగా ఎవరినీ ఖాళీ చేయించలేదని వివరించారు. నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించి, రూ.25వేలు ఇచ్చినట్లు తెలిపారు. చెరువుల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాన్ని హైడ్రా కూల్చింది తప్ప పరివాహకంలో ఎవరి ఇళ్లను కూల్చింది. దసరా సందర్భంగా ఆయా నిర్వాసితులకు ఇండ్లు, ఖర్చులకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి తరలించామన్నారు. చినుకు పడితే చాలు హైదరాబాద్‌ నగరంలో గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్ అవుతోందన్న సీఎం, రోడ్లపై పడిన వర్షపు నీరు చెరువుల్లోకి, నదుల్లోకి చేరాలా.. లేక రోడ్లపై ఉండాలా? అని ప్రశ్నించారు. అసలు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడం విపక్షాలకు ఇష్టం లేదన్న సీఎం చరిత్ర కాలగర్భంలో మూసీని సమాధి చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

ఉప్పెనలా వరదలు వస్తే నగరమే మిగలదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. నగరం ఏమైనా గజ్వేల్ ఫామ్ హౌసా, లేక ధరణి లాంటి మాయాజాలం అనుకుంటున్నారా..? అని సెటైర్లు విసిరారు ఓ తెలంగాణ కవి తన నలుగురు కూతుర్లకు గంగ, యమునా, సరస్వతీ, కృష్ణవేణి అని పేర్లు పెట్టుకున్నారన్న సీఎం మూసీ నది పేరు పెట్టుకోకపోవడానికి గత పాలకులు కాదా? ఈ ద్రోహం ఇలాగే కొనసాగిద్దామా..? అని ప్రశ్నించారు. దేశ ద్రోహం కంటే పెద్ద నేరమన్నారు. హీరోషిమా,నాగసాకిలలో పడిన అణుబాంబు కంటే మూసీ ఆక్రమణ ప్రమాదకరమన్నారు. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్ట్ లోతన స్వార్థం లేదని స్పష్టం చేశారు. తాము అధికారంలో ఉండేది ఐదేళ్ల, పదేళ్ల అనేది రాష్ట్ర ప్రజలే.

మీ నిర్వాకంపై చర్చిద్దామా..?

మల్లన్న సాగర్‌, వేమలఘాట్‌లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలని సీఎం విపక్ష నేతలకు సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము పోలీసులతో కొట్టి, గుర్రాలతో తొక్కించి రాత్రికి రాత్రే వారు ఖాళీ చేయించారు. మల్లన్న సాగర్ ,రంగనాయక్ సాగర్ , కొండపోచమ్మ కు ఎక్కడికైనా సెక్యూరిటీ లేకుండా వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అందరూ వస్తే రచ్చబండ నిర్వహించి ఈ విషయాలపై చర్చిద్దామన్నారు. అవసరమైతే కేసీఆర్ నియోజకవర్గానికీ వచ్చేందుకు తాను సిద్ధమేనన్న సీఎం.. అందుకు ఆయన సిద్ధమేనా..? అని సవాల్ విసిరారు. కొండపోచమ్మ ప్రాజెక్టులో మునిగిన 14 గ్రామాల్లో ఏ ఒక్కరికైనా ఇండ్లు ఇచ్చారా? అని ప్రశ్నించిన సీఎం మిడ్ మానేరు ముంపు బాధితులకు ఇండ్లు ఇస్తామని మోసం చేసింది మీరు కాదా అని కేసీఆర్, కేటీఆర్ లను ప్రశ్నించారు. కనీ తాము మాత్రం అలా చేయడం సహాయం. బఫర్ జోన్ లో ఉన్న10వేల కుటుంబాలకు కూడా పునరావాసం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమన్నారు.

మూసీ ఒడ్డున ఉంటారా?

మూసీ సుందరీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అనలేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటున్న నేతలు 3 నెలల పాటు ఆ నది ఒడ్డున జీవించి చూపాలని సవాలు విసిరారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా ఈటల రాజేందర్‌ 3 నెలలు మూసీ ఒడ్డున ఉండాలని, వాళ్లు అక్కడ ఉంటామంటే కావాల్సిన వసతులు కూడా కల్పిస్తామని. ముగ్గురూ మూడు నెలలు అక్కడ ఉంటే, ఈ ప్రాజెక్టును ఆపేస్తామన్నారు. మూసీ పరివాహకంలోనే ఉండి ప్రజల కోసం పోరాడాలి, వారి జీవితం బాగుందని నిరూపించాలని సీఎం అన్నారు. మూసీ విషం హైదరాబాద్ నగరాన్నే కాకుండా నల్లగొండ జిల్లానూ విషతుల్యం చేస్తోందన్నారు. నల్లగొండ ఏర్పాటు ఎలా పునరుజ్జీవనం కలిగించాలని అడిగితే రూ.1.50 లక్షల కోట్లు అని మాట్లాడేందుకు విపక్షాలపై ఉంది. దోచుకోవడానికి ఇదేమైనా కాళేశ్వరం అనుకుంటున్నారా? అని చురకలంటించారు.

మూసీ పునరుజ్జీవంపై ప్రత్యేక అసెంబ్లీ పెడదాం..

మూసీ నది పునరుజ్జీవనంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెడదామని సీఎం నిర్ణయించారు. ఆ ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన వారికి ఏం ఇద్దామో చెప్పాలని కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, ఈటెల చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఎంపీల అభిప్రాయాలను అసెంబ్లీ రికార్డుల్లోకి తీసుకువెళ్లామని చెప్పారు. అభివృద్ధి విషయంలో హైదరాబాద్ నగరాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఎంఐఎం, బీజేపీ, బీఆరెస్, కమ్యూనిస్టు పార్టీల అధ్యక్షులకు విజ్ఞప్తి చేశారు. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయో తనకు పంపాలన్న సీఎం ప్రభుత్వం రాతపూర్వక వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ శనివారం లోగా సలహాలు, సూచనలతో కూడిన కార్యాచరణ ప్రణాళికలు.

18 నెలల్లో డీపీఆర్…

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడానికి ఇక్కడ ఐదు కంపెనీలు ఉన్నాయన్నఆయన అవే దానికి అవసరమయ్యే నిధుల అంచనా, నిధుల సేకరణ లాంటి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. మూసీని ఏం చేయాలో 18 నెలల్లో డీపీఆర్ అందిస్తారని చెప్పారు. ఇప్పటి వరకు మూసీ నదికి సంబంధించిన ఒప్పందం రూ.141 కోట్లు మాత్రమేనన్న రేవంత్ రెడ్డి రూ.1.50లక్ష కోట్ల ప్రచారం ఎక్కడి నుంచి పుట్టిందోనన్నారు. విపక్ష నేతలు ఏ సంస్థల గురించి మాట్లాడుతున్నారో గతంలో వారే ఆయా సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారు. అప్పుడు లేని అభ్యంతరం మూసీ అభివృద్ధి విషయంలోనే ఎందుకని నిలదీశారు. వాళ్లు చేస్తే గొప్ప.. మేం చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech