Home తెలంగాణ క్రీమీలేయర్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం … ‘మీట్ ది ప్రెస్’లో మంద కృష్ణ మాదిగ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

క్రీమీలేయర్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం … ‘మీట్ ది ప్రెస్’లో మంద కృష్ణ మాదిగ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
క్రీమీలేయర్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం ... 'మీట్ ది ప్రెస్'లో మంద కృష్ణ మాదిగ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నానని మాదిగ రిజర్వేషన్ పోరాట నమితి(ఎంఆర్పీఎస్) జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చెప్పారు. ఎదిగిన కులాల చేతుల్లో పార్లమెంట్ ఉందని, ఇటీవల 100 మంది ఎంపీలు ప్రధానిని కలిసి వర్గీకరణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎదిగిన దళిత, గిరిజనులు పార్లమెంట్‌లో ఉంటే ఎదగని కులాల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సిఎం రేవంత్ రెడ్డిని కలిసి వర్గీకరణ వీలేనంత త్వరగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశామని, ఆయన అంగీకరించి ఒక్కసారి ఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవాలని నూచించారని, ఎందుకు కలవమన్నారో తమకు తెలియదని అన్నారు.

గ్రూప్-1 ఫలితాలు వర్గీకరణ ప్రకారం ప్రకటించాలని, ఈ విషయంపై పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను కలుస్తామన్నారు. వర్గీకరణ పలు రాష్ట్రాల కోసం నియమించిన ఏ కమీషన్ కూడా వర్గీకరణను వ్యతిరేకించలేదని, న్యాయ వ్యవస్థ న్యాయబద్ధంగా నిలబడిందని, డబ్బు, రాజకీయం, మీడియా ఉందని చూస్తే పనిచేయలేదని సమాజం ఆలోచించింది. ఎక్కడ జరగని విధంగా వర్గీకరణ ఉద్యమం మూడు దశాబ్దాల పాటు దేశంలో కొనసాగుతుందని, చిట్టచివరికి విజయం సాధించామని, ఎంతో మంది ప్రాణ త్యాగం చేశామని, సమాజం కూడా అన్ని విధాల సహకరించిందని.

బిసిలలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీల్లో వర్గీకరణ ఎందుకు ఉండకూడదనే పట్టుదలతో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది. వర్గీకరణ ఉద్యమంతో పాటు ఎంఆర్పీఎస్ అన్ని వర్గాల కోసం అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర బడ్జెట్, పాలకుల వేతనాలు పెంచాయని, కానీ వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పెన్షన్ పెంచలేదని, తమ పోరాటాల ఫలితంగా నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర బడ్జెట్ పాలకుల వేతనాలు పెంచాయని, కానీ వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పెన్షన్ పెంచలేదని, తమ పోరాటాల ఫలితంగా నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆచి తూచి ఆరు వేలకు పెరిగాయని, ఆరోగ్యశ్రీ తమ ఉద్యమం ద్వారా వచ్చిందన్నారు.

హైదరాబాద్ నగరంలో ప్రియాంకారెడ్డి ముతన్పై రాజకీయాలకు ప్రతి ఒక్కరూ స్పందించి, ప్రభుత్వం నలుగురు యువకులను ఎన్‌కౌంటర్ చేసిందని, ఆ ఘటనకు ముందు వరంగల్, ఆదిలాబాద్, ప్రస్తుత మేడ్చల్ జిల్లా అజిపూర్‌లో బాలికపై జరిగిన అత్యాచారం, హత్యలపై ఎవరైనా స్పందించినట్లు సమాచారం. తాము ఉద్యమించడం వల్లనే రాష్ట్రంలో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిందని కృష్ణమాదిగ చెప్పారు. మాదిగలకు జనాభ ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కడం లేదని, మాల సోదరులు వర్గీకరణను అడ్డుకుంటున్నారని, వర్గీకరణను అడ్డుకుంటే తిరిగి రోడ్లమీదకు వచ్చి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ మీట్‌ ప్రెస్‌లో టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు విరాహత్‌అలీ, రాంనారాయణ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్‌ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు రాజేష్‌, హెచ్‌.యూ.జే అధ్యక్షులు శిగ శంకర్‌గౌడ్‌ ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech