భారతదేశం అంటే సెక్యులర్ దేశం. ఇక్కడ అన్ని మతాలవారు ఉంటారు. అయితే ఎవరి నమ్మకాలు వారివి. ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడం, లేదా ఆ మతాల వారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం అనేది ఎవరూ సహించలేరు. ముఖ్యంగా ఈమధ్యకాలంలో హిందూ మతాన్ని అవమానిస్తూ కొన్ని దారుణమైన ఘటనలు జరిగాయి. అందులో భాగంగానే సికింద్రాబాద్, అంబర్‌పేట, నాంపల్లిలోని కాళీమాత ఆలయాలపై దాడులు జరిగాయి. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం మనం చూశాం. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లిం యువకుడికి స్థానికులు దేహశుద్ది చేశారు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని నిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు. చేసిన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుకు విచారించకుండానే, ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే పోలీసులు ఒక నిర్ణయానికి రావడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఇటువంటి దుశ్చర్యలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నటుడు నరేష్ ట్విట్టర్ ద్వారా ఈ ఘటనపై, పోలీసుల వ్యవహారశైలిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. నరేష్ తన ట్వీట్‌లో ఏంటారంటే..
‘సికింద్రాబాద్, అంబర్‌పేట్, నాంపల్లిలోని కాళీమాత ఆలయాలపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అత్యంత దారుణమైన విషయం.. క్షుణ్ణంగా విచారించకుండానే నిందితుడు మానసిక వ్యాధిగ్రస్తుడనే నిర్ధారణకు అధికారులు వచ్చారు. సాంస్కృతిక ఉగ్రవాదాన్ని ఎందుకు కాపాడాలి. సెక్యులర్ అని పిలవబడే మన దేశంలో మనమందరం శాంతియుతంగా పూజిద్దాం. దీనికి పారదర్శక విచారణ, న్యాయం అవసరం’ అంటూ ట్వీట్ చేశారు నరేష్.