- నగర బ్రాండ్ ఇమేజ్ పెరిగితే నిర్మాణ రంగం విస్తరిస్తుంది
- బిల్డర్ల సమస్యలను గౌరవించి పరిష్కరిస్తాం
- బిల్డర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు
- నగరాభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించాం…మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :-హైదరాబాద్ నగరాన్ని మరింతగా విస్తరింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని….ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో బిల్డర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, బిల్డర్స్ సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంది. నగరం విస్తరణలో బిల్డర్స్ పాత్ర బలంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.హైదరాబాద్‌ను విశ్వ నగరంగా మార్చేందుకు తాజాగా పదివేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. క్యాపిటల్ ఇన్వెస్టెమెంట్ కోసం మాత్రమే వీటిని ఖర్చు చేసింది.
ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, వరల్డ్ క్లాస్ స్టేడియంలు, స్కిల్ యూనివర్సిటీ వంటి గొప్ప ప్రాజెక్టులతో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలపబోతున్నామని వివరించారు. రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు బిల్డర్స్ కోరిన విధంగా బ్యాంకర్స్‌తో సమావేశం నిర్వహించామని హామీ ఇచ్చారు. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రధాన ప్రభుత్వ శాఖల ద్వారా బిల్డర్లు కోరుకున్న విధంగా స్పష్టత ఇప్పిస్తామని బిల్డర్లకు డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ నగర రాజ్యాంగాన్ని విస్తరించింది. ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటలు కాపాడుకొని భవిష్యత్తు తరాలకు అందించాలంటే ఉన్నత లక్షమే తప్ప ఈ ప్రభుత్వానికి మరో ఉద్దేశం లేదని వివరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచితేనే నిర్మాణరంగం, మూసీ నదిని పునర్జీవింప చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం బలంగా పెరుగుతుంది. అనేక దశాబ్దాలుగా ఉన్న చెరువులు, కుంటలు క్రమంగా కనుమరుగవుతున్నాయి, వాటిని కాపాడుకొని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత మనందరిపైన ఉందని వివరించారు.
బిల్డర్స్ సంపద సృష్టికర్తలు.. మీ సమస్యలను గౌరవించి పరిష్కరిస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం మీతో ఉంది.. రాష్ట్ర నిర్మాణరంగం ఎదగాలని యావత్ మంత్రి మండలి బలంగా కోరుకుంటోంది. సమస్యలపై ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటామని బిల్డర్స్ అభిప్రాయపడ్డారు, మీ అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పారు. అన్ని అంశాలను ముఖ్యమంత్రితో చర్చించి తగు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు
రాష్ట్ర చరిత్రలో కూడా లేనివిధంగా హైదరాబాద్ నగరం అభివృద్ధికి పదివేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తెలిపారు. బిల్డర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఆ ఆలోచన మేరకే బిల్డర్స్ తో ప్రత్యేక సమావేశం జరిగింది. బిల్డర్‌లకు సంబంధించిన ప్రతి పరిశీలన జాగ్రత్తగా పరిశీలించాం. హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ యావత్తు ప్రతిరోజు పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్, తెలంగాణ క్రెడాయి అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి, హైదరాబాద్ క్రెడాయి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.