Home తాజా వార్తలు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌కు పదవి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌కు పదవి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌కు పదవి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • జాతీయ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు
  • త్వరలో బీజేపీ సంస్థాగత ఎన్నికల నియామకం

ముద్ర, తెలంగాణ బ్యూరో :తెలంగాణ బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కే. లక్ష్మణ్‌కు బీజేపీ అధిష్ఠానం జాతీయ స్థాయిలో కీలక పదవిని ఇచ్చింది. ఇప్పటికే యూపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన లక్ష్మణ్‌కు జాతీయ రిటర్నింగ్ అధికారిగా నియమించారు. త్వరలో జరగనున్న బీజేపీ సంస్థాగత ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు, కో రిటర్నింగ్ అధికారాలను అధిష్ఠానం నియమించింది.. అందులో తెలంగాణ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్‌ను నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ రోజుల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్న పార్టీ జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్లు, కో రిటర్నింగ్‌ల నియామకాలు చేపట్టారు. అయితే.. ఇందులో తెలంగాణ నుంచి సీనియర్ నేత అయిన ఎంపీ కె. లక్ష్మణ్‌ను బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

ఇక.. కో రిటర్నింగ్ అధికారులుగా ఎంపీలు నరేష్ బన్సల్, డా. సంబిత్ పాత్రతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు రేఖా వర్మను నియమించింది అధిష్ఠానం. వీరి ఆధ్వర్యంలోనే.. బీజేపీ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో సీనియర్ నేత అయిన లక్ష్మణ్.. కమలం పార్టీకి వివిధ పదవుల్లో తన సేవలందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న లక్ష్మణ్‌ను.. ఉత్తర ప్రదేశ్ నుంచి అధిష్ఠానం ఈ అవకాశం కల్పించింది. డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా లక్ష్మణ్ సేవలు అందించారు. అంతకుముందు ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొంది అసెంబ్లీలో బీజేపీ తన గళాన్ని గట్టిగానే వినిపించింది.

ఇదిలా ఉంటే.. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమలం పార్టీ.. రాష్ట్రంలో కీలకంగా ఉన్న నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు ఇస్తూ.. పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన ఎంపీ 8 సార్లు గెలుచుకోగా.. అటు కిషన్ రెడ్డికి, ఇటు బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టింది. ఆ తర్వాత.. లక్ష్మణ్‌కు యూపీ తరపున రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చింది. ఇదిలా ఉండగానే.. లక్ష్మణ్‌కు ఇప్పుడు జాతీయ స్థాయిలో కీలక పదవి అప్పగించింది. దీంతో.. జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు సముచిత స్థానం ఇస్తున్నట్టుగా పార్టీ కేడర్‌కు, రాష్ట్ర ప్రజలకు సంకేతాలు ఇచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech