Home తెలంగాణ వరదల ప్రభావం – రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన వెంకయ్యనాయుడు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

వరదల ప్రభావం – రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన వెంకయ్యనాయుడు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
వరదల ప్రభావం - రెండు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన వెంకయ్యనాయుడు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వరదలు ముంచాయి. జల విలయంలో రెండు రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఈ వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు.

తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి ఆయన విరాళం ప్రకటించారు. రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని అందించారు. ఆయన కుమారుడు, కూతురు కూడా రెండు రాష్ట్రాలకు రూ. 2.5 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రధాని మోదీకి తాను ఫోన్ చేశానని… రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని కోరారు. ఇరు రాష్ట్రాల అధికారులతో కేంద్ర అధికారులు టచ్ లో ఉన్నారని మోదీ తనకు చెప్పారని అన్నారు. ఇరు రాష్ట్రాలకు సాయం ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని కోరారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech