భూదాన్ పోచంపల్లి, ముద్ర:- మద్యం మత్తులో కొడుకు తండ్రిని బలిగొన్న ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ ఐ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన పర్వతం ఎల్లయ్య (45) ఇనుప సామానును బేరం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు.
గత నెల 25 న గ్రామంలో బోనాల పండగ సందర్భంగా పర్వతం ఎల్లయ్య మద్యం సేవించి తన కుమారుడైన పర్వతం శ్రీశైలం ను ఇష్టానుసారంగా తిట్టడంతో మధ్య వాగ్వాదం జరిగింది. దీనితో శ్రీశైలం క్షణికావేశంలో తండ్రిని కాళ్లతో కడుపులో తన్ని చితకబాదాడు. తండ్రి స్పృహ కోల్పోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పర్వతం ఎల్లయ్య సోమవారం మృతి చెందాడు .మృతుడి గంగమ్మ ఫిర్యాదు మేరకు భార్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.