21
ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 42.2 అడుగులుగా ఉండగా.. గురువారం ఉదయం 8 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరుకుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం పెరుగుతున్నట్లు తెలిపారు. అటు భద్రాచలం వద్ద ఔట్ ఫ్లో 9,74,66 క్యూసెక్కులుగా. కాగా ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భారీ వర్షాల నేపధ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు భావిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.