33
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత మూడేళ్లుగా టీపీసీసీకి సారధ్యం వహించి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చిన ఏ రేవంత్ రెడ్డిని ఏఐసిసి అభినందించింది.
మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. టీపీసీసీ పదవి రేసులో అనేక మంది పేర్లతో మహేష్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ అధిష్టానం కుమార్ గౌడ్ వైపు మొగ్గుచూపింది.