- ప్రజలతో మమేకమై ప్రజా పోరాటాలు చేశాం
- సాయుద తెలంగాణ పోరాట వార్షికోత్సవ సభలో cpm జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్
ముద్ర,పానుగల్ :- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర కమ్యూనిస్టులదేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బర్ అన్నారు. మంగళవారం తెలంగాణ సాయుధ పోరాటోత్సవం సందర్భంగా పానుగల్ మండల పరిధిలోని రేమద్దుల గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు .
నాడు ఆర్ఎస్ఎస్, బిజెపి, ఆర్య సమాజ్ ఏ ఒక్కరు నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడలేదు అని అన్నారు. ఆనాడు భూస్వాములు దొరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బిజెపి వారు ముస్లింలకు హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించి వక్రీకరణ వారు అన్నారు.సాయుధ పోరాటములో అన్ని కులాల మతాల వారు పాల్గొని తిరుగుబాటు చేశారు. భూస్వాముల రాజాకార్ల దాడిలో 1500 మంది కమ్యూనిస్టులు మరణించారని sep 17 తర్వాత 1951 వరకు నెహ్రూ సైన్యం సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో దాడిలో 2500 మంది కమ్యూనిస్టులు మరణించారు.గ్రామాల్లో రాజ్యాలు నిర్మించుకొని భూస్వాములను పట్టానాలకు తరిమికొట్టారు 19 లొంగిపోయి బారతదేశంలో విలీనం చేసారు కాబట్టి విలీన దినమని అన్నారు.భూస్వాములు ఖద్దర్ టోపీలు పెట్టుకుని మళ్ళీ పేదల భూములు గుంజేందుకు అవకాశం రాబోయే కాలంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా పోరాటాలు నిర్వహించబోతున్నాం. అనంతరం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భగత్,వెంకటయ్య,మల్లేష్ ,ఖాజా,చంద్ర శేఖర్ , వెంకటయ్య ,నిరంజన్, భాస్కర్