- 2028లో రాష్ట్ర బడ్జెట్ రూ.7 లక్షల కోట్లు
- రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈలు కీలకం
- వ్యవసాయం, పరిశ్రమల్లో యువతకు ప్రోత్సాహం
- భూమి, నీరు, ఆర్థిక సాయం అందిస్తాం
- విద్యార్థుల్లో నైపుణ్యం పెంపుకు స్కిల్ యూనివర్సిటీ
ముద్ర, తెలంగాణ బ్యూరో : 2028లో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ రూ.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధి కీలకమన్నారు. ప్రస్తుతం రాష్ట్రం వడ్డించిన విస్తరాకును తలపిస్తోందన్న ఆయన పరిశ్రమల సాధన, అభివృద్ధికి అవసరమైన భూమి,నీరు,ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నూతన విధానం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించలేదన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర సంపదను పెంపొందించాలనే ఉద్దేశంతో నూతన పారిశ్రామిక విధానం పాలసీను ఆవిష్కరించింది. గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే కొత్త పాలసీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని ఆ విషయంలో ఎలాంటి రాజకీయాలు ఉండవు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగించడానికి మాకు అభ్యంతరం లేదన్న ఆయన పాలన పరంగా అందరి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే వస్తువులను తొలగించేందుకు తమప్రభుత్వానికి తగ్గబోదన్నారు.
ఏటా ఎంతో మంది ఇంజినీరింగ్ విద్యార్థులు బయటకొస్తున్నారన్న సీఎం..ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. అందుకోసం నైపుణ్యం కోసం కృషి చేస్తున్నాం. మహేంద్ర, టాటా కంపెనీ కూడా ప్రత్యేక సమావేశాలు చేసి పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చారు. టాటా ఇంతితో కలిసి వాటిని రూ.2400 కోట్లతో ఆధునీకరిస్తున్నామన్నారు. పూర్తి అధ్యయనం తర్వాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్న సీఎం అందులో పరిశ్రమలకు తగిన నైపుణ్యం అందించేలా యువతకు శిక్షణ ఇస్తున్నారు. యూనివర్సిటీ నిర్వహణకు పారిశ్రామికవేత్తల నుంచి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నామని ఇది యూనివర్సిటీ నిర్వహణకు ఖర్చు చేసేలా ప్రభుత్వ విధి విధానాలు ఖరారు చేసిందని చెప్పారు. రైతులెవరూ వ్యవసాయాన్ని వదలొద్దన్న సీఎం.. దాన్ని తమ సాంప్రదాయమని గుర్తించాలన్నారు.
పంటలు పండిస్తూనే ఇతర కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాల వైపు ప్రోత్సహించడం ద్వారా వ్యాపారాల్లో రాణించేలా చూడాలన్నారు.హైదరాబాద్‌లో నిర్మించబోతోన్న ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. స్వయంసహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. స్వయం సహాయక ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం శిల్పారామంలో 3ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు వివరించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో వాటి నిర్వహణను మహిళల చేతుల్లోపెట్టామన్నారు. స్కూల్ యూనిఫామ్ కుట్టు పని బాధ్యతలు వారికే అప్పజెప్పామన్నారు. యూనిఫామ్ ధరను రూ.25 నుంచి రూ.75 చేసి ఆడబిడ్డలను ఆర్థికంగా ఆదుకుంటున్నామన్నారు. ప్రస్తుతం మురికి కోపంగా మారిన మూసీనది మ్యాన్ మేడ్ వండర్ గా మారుతున్నట్లు సీఎం. విదేశీ పర్యటకులు మూసీ వీక్షణకు వచ్చేలా దాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, దానికి తగినట్లుగా ఉన్నారు.