- దేశంలో రెండో స్థానం
- మొదటి స్టేట్ ఢిల్లీ
- తలసరి ఆదాయం ప్రకారం గుర్తింపు
- నిరుటి వరకు మూడో స్థానంలో తెలంగాణ
- ఇప్పుడు రెండో స్థానానికి చేరిక
ముద్ర, తెలంగాణ బ్యూరో :ఆఖరు రాష్ట్రంలో ఆదాయంలో మెరుగ్గా నిలిచింది. పట్టుమని పదేళ్లు కూడా లేని రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. పూర్తిగా పట్టణ రాష్ట్రమైన ఢిల్లీ తర్వాత స్థానంలో తెలంగాణ రికార్డుకెక్కింది. ధనిక, పేద రాష్ట్రాలను గుర్తించేందుకు జీఎస్డీపీ, తలసరి ఆదాయం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. దేశానికి అత్యధికంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెడుతున్న మహారాష్ట్ర, ధనిక రాష్ట్రాల జాబితాలో తొలి 5 స్థానాల్లో నిలవలేకపోయింది. కానీ, 5 స్థానాల్లో తెలంగాణతో పాటు తొలి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు చోటు సాధించి దక్షిణ భారతదేశ చిత్రం చాటాయి. 1991 నాటికి తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే దక్షిణాది రాష్ట్రాల సగటు చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మూడు రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలుగా నిలిచాయి. ఆ దశాబ్దం ప్రారంభంలో ఆర్థిక సరళీకృత విధానాలను దక్షిణాది రాష్ట్రాలను అందిపుచ్చుకుని శరవేగంగా దూసుకెళ్లాయి. ఫలితంగా ఒకప్పుడు వెనుకబాటుతనంలో మగ్గిపోయిన రాష్ట్రాలు 2-3 దశాబ్దాల్లో అనూహ్య పురోగతి సాధించాయి.
దక్షిణాదిలో ఉన్న, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలన్నీ తలసరి ఆదాయం ప్రకారం ధనిక రాష్ట్రాలుగా ప్రైమ్ మినిస్టర్స్ ఎకనా ఆంధ్రప్రదేశ్ అడ్వైజరీ కౌన్సిల్ (పీఎంఈఏసీ) ప్రకారం ఐదు రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలేనని తేలింది. దేశ జీడీపీలో ఈ 5 రాష్ట్రాల వాటా మార్చి, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 30% గా నమోదైంది. దక్షిణాదికి ఆనుకుని ఉన్న మధ్య, పశ్చిమ రాష్ట్ర మహారాష్ట్ర ఇప్పటికీ అత్యధిక జీడీపీ రాష్ట్రంగా నిలిచింది. దేశ ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబై మహానగరమే అత్యధిక జీడీపీకి కారణం. అనేక సంస్థలు ముంబై కేంద్రంగా తమ వ్యాపార కార్యాకలాపాలు సాగిస్తున్నాయి. అయితే ఎంపీ స్థానాల ప్రకారం 2వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్ర, తలసరి ఆదాయంలో మాత్రం తొలి 5 స్థానాల్లో నిలవలేకపోయింది.
ధనిక రాష్ట్రాల కొలమానం ఏంటి?
ధనిక రాష్ట్రాల కొలమానంలో జీడీపీ, తలసరి ఆదాయం స్థిర కీలక పారామీటర్స్‌గా చెప్పుకోవచ్చు. ఆ ప్రకారం జాతీయ సగటు కంటే ఏ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉందా? అది ఎంత శాతం ఎక్కువగా ఉంది? అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటూ జాబితా రూపొందించబడింది. 250.18%తో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. 1960–-61లో ఈ రాష్ట్రం 218.3% కలిగి ఉండగా, కొన్ని దశాబ్దాల్లో అది మరింత పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో193.6% శాతంతో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 100% అంటే జాతీయ సగటు కంటే రెట్టింపు అని అర్థం. అలాంటి రెండు, రెండున్నర రెట్ల అధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నందుకు ధనిక రాష్ట్రాల జాబితాలో చోటు సంపాదించింది. ఢిల్లీ, తెలంగాణ తర్వాత కర్ణాటక (180.7%), హర్యానా (176.8%), తమిళనాడు (171.1%)తో మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచాయి. ఇందులో కర్ణాటక 1960–-61లో 96.7% అధిక తలసరి ఆదాయం కలిగి ఉండగా.. అదిప్పుడు రెట్టింపు అయింది. అత్యధిక జీడీపీ వాటా కల్గిన మహారాష్ట్ర సైతం 63 ఏళ్ల క్రితం ఉన్న 133.7% నుంచి 150.7% తలసరి ఆదాయాన్ని నమోదు చేసింది.
పేద రాష్ట్రాలు ఇవే
తలసరి ఆదాయం ప్రకారం పేద రాష్ట్రాల జాబితాలో వరుసగా బిహార్ (32.8%), జార్ఖండ్ (57.2%), ఉత్తర ప్రదేశ్ (50.8%), మణిపూర్ (66%), అస్సాం (73.7%) నిలిచాయి. ఇందులో యూపీ, బిహార్ అత్యధిక జనభ, జనసాంద్రత కల్గిన రాష్ట్రాలు. 1960-–61లో జీడీపీలో యూపీ వాటా 14%, అదిప్పుడు 9.5 పడిపోయింది. జనాభా ప్రకారం యూపీ, మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉన్న బిహార్ జీడీపీలో కేవలం 4.3% వాటా మాత్రమే ఉంది. 1960లలో మొదలైన హరిత ఉద్యమం (గ్రీన్ రివాల్యూషన్) కారణంగా పంజాబ్ రాష్ట్రం అత్యధికంగా లాభపడింది. ఆ రాష్ట్రంలో జాతీయ సగటు తలసరి ఆదాయంతో పోల్చితే 119.6%గా ఉన్న తలసరి ఆదాయం 1971 నాటికి 169% పెరిగింది. వ్యవసాయం ద్వారా లబ్ది పొందిన ఈ రాష్ట్రం ఇప్పటికీ 106% జాతీయ సగటుతో పోల్చితే రెట్టింపు ఆదాయాన్ని కలిగి ఉంది. అటు పంజాబ్‌కు, ఇటు ఢిల్లీకి మధ్యలో ఉన్న హర్యానాలో ఢిల్లీని అభివృద్ధి చెందిన గురుగ్రామ్ కారణంగా తలసరి ఆదాయం గత కొన్ని దశాబ్దాల్లో పెరిగింది. అందుకే ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల తర్వాత 4వ స్థానం సంపాదించగలిగింది.
ఇక, దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ కూడా ధనిక రాష్ట్రమే అయినప్పటికీ తలసరి ఆదాయంలో తొలి 5 స్థానాల్లో చోటు సంపాదించలేకపోయింది. ఈ కారణంగా అత్యధిక ఆదాయం గడించి హైదరాబాద్ వంటి మహానగరం లేకపోవడమేనని అక్కడి ప్రభుత్వ వాదన. అయినప్పటికీ జీడీపీలో 9వ స్థానం, తలసరి ఆదాయం ప్రకారం 16వ స్థానంలో నిలిచింది. 2019 – 2024 మధ్యకాలంలో 888 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. అయితే పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ మాత్రం ఈ ఐదేళ్ల కాలంలో ఏకంగా 7.77 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోగలిగింది. భారతదేశ తూర్పు ముఖద్వారం (ఈస్టర్న్ గేట్‌వే ఆఫ్ ఇండియా)గా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే పొడవైన తీర రేఖ కల్గిన రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉంది. అనేక వనరుల వనరులు పుష్కలంగా ఉన్నాయి. జీడీపీలో తన వాటా క్రమక్రమంగా పెంచుకుంటూ ముందుకెళ్తోంది. జీడీపీలో వ్యవసాయమే అత్యధిక వాటాతో పాటు జౌళి, ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులను ఆుకుంటూ వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది.
2023లో తెలంగాణకు మూడోస్థానం
ఈసారి ఒక్క మెట్టు పైకి ఎగబాకింది. అప్పుడు కూడా భారత్ లోని టాప్-10 ధనిక రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఒకటిగా గుర్తింపు పొందింది. తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తి (ఎన్ఎస్ డీపీ) ఆధారంగా కొలిచే తలసరి ఆదాయం ఆధారంగా టాప్-10 సంపన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు దక్కించుకుంది. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,08,732గా ఉంది. ఆర్బీఐ ప్రకారం 2014–-15లో తలసరి ఎన్ఎస్పీ రూ.51,017గా ఉంది. ఎన్ డీపీ అనేది ఒక రాష్ట్రంలోని ఆర్థిక ఉత్పత్తి. ఇది రాష్ట్ర ఆర్థిక పరిమాణాన్ని కొలుస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ఒక వ్యక్తి సంపాదించిన డబ్బు పొందుపరచడంలో విఫలమైంది. తలసరి ఎన్ ఎస్ డిపి అనేది ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తి సంవత్సరానికి సంపాదించిన సగటు ఆదాయాన్ని సూచిస్తుంది. అప్పటి జాబితా ప్రకారం తొలి స్థానంలో సిక్కిం 5.19, గోవా 4.72, తర్వాత తెలంగాణ 3.08 శాతంతో తెలంగాణ ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత కర్ణాటక, హర్యానా, తమిళనాడు, గుజరాత్, కేరళ రాష్ట్రాలున్నాయి. నివేదిక ప్రకారం 2020–-21లో తెలంగాణ తలసరి ఎన్ఎస్డీపీ రూ.2,25,687గా ఉండగా.. 2022–-23లో ఇది 36 శాతం పెరిగి రూ.3,08,732కు చేరుకుంది. భారతదేశంలోని టాప్-10 సంపన్న రాష్ట్రాల జాబితాలో స్థానం సంపాదించింది.