పరారీలో ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు గుర్తించారు. సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు ఆయన్ను బెంగుళూరు ఎయిర్ పోర్ట్ సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారని సమాచారం. కాగా, తనను జానీ మాస్టర్‌గా వేధించాడని ఆయన దగ్గర పని చేసే మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అలాగే మతం మార్చుకొని పెళ్లి చేసుకోమ్మని బలవంతం చేసాడు అంటూ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దీంతో టాలీవుడ్ లో జానీ మాస్టర్ కేసు చర్చగా మారింది. అయితే ఈ ఆరోపణలు వచ్చిన దగ్గర్నుంచి జానీ మాస్టర్ కనపడట్లేదు. తాజాగా నేడు జానీ మాస్టర్ ని సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో జానీ మాస్టర్ ని తీసుకుని హైదరాబాద్ కి తరలిస్తున్నారు.