ముద్ర,సెంట్రల్ డెస్క్:- నేడు లోక్‌సభ మూడో విడత ఎన్నికల పోలింగ్. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 93 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్‌గఢ్, కర్ణాటకతో పాటు రాష్ట్రంలో ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 1352 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 17.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం 1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఓటుహక్కును అందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని.. ఎన్నికల సంఘం ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసెజ్‌లు పంపుతోంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ గుజరాత్‌కి చేరుకున్నారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఓటు వేశారు #లోక్‌సభ ఎన్నికలు 2024 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో pic.twitter.com/5r6Hsm1AZ3
– ANI (@ANI) మే 7, 2024