Home తెలంగాణ కూల్చివేయకండి …హైడ్రాకు హైకోర్టు ఆదేశం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

కూల్చివేయకండి …హైడ్రాకు హైకోర్టు ఆదేశం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
నిబంధనల సవరణపై ఏం చేస్తారు... ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • దుర్గం చెరువు బాధితులకు ఊరట
  • ఆరు వారాల్లో ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించాలని జీహెచ్‌పీకి ఆదేశాలు
  • బాధితుల జాబితాలో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : దుర్గం చెరువు పరిసర నివాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు పరిసర ప్రాంతాల కూల్చివేతలపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. అలాగే అక్టోబర్ 4 వ తేదీన లేక్ ప్రోటక్షన్ ముందు హాజరు కావాలని నిర్వాసితులకు ఆదేశించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు నిర్వాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో నిర్వాసితుల అబ్జెక్షన్స్‌పై లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోవాలని, అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరవుతారని, వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4 నుంచి ఆరు వారాలలోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిన లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

చెరువుల పరిధిలోని ఆక్రమణలపై జెట్ స్పీడ్‌లో హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. జూన్ 26 నుంచి కూల్చివేతలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 30 ప్రాంతాలు 300 ఆక్రమణలను కూల్చి వేసింది. దాడులకు గురైన 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో చెరువును హైడ్రా కమిషనర్ రంగనాధ్ గుర్తించారు. రంగంలోకి దిగి హైడ్రా వెంటనే సిబ్బంది కూల్చివేస్తున్నారు. హాయ్ రీచ్ జా క్రషర్స్‌తో పాటు జేసీబీలతో, బుల్డోజర్‌లతో కూల్చి వేతలు చేశారు. జీహెచ్‌సీతో పాటు ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు పెంచారు. తాజాగా అమీన్ పూర్‌లో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టారు. 17 గంటలపాటు నాన్ స్టాప్‌గా ఇళ్లు, భవనాలు, అపార్టుమెట్లు కూల్చివేసింది. అలాగే ఓ హాస్పిటల్, రెండు అపార్ట్ మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గుడాలో 16 విల్లాలు కూల్చివేసింది. సోమవారం తెల్లవారుజాము ఒంటిగంట వరకు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలకు అనుకొని ఉన్న పక్క ఇళ్లకు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా 17 గంటలపాటు హైరిస్క్ ఆపరేషన్ కొనసాగించి రికార్డు క్రియేట్ చేసింది.

మళ్లీ మొదలు

ఇటీవల గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వారాలపాటు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ప్రకటించిన హైడ్రా.. తిరిగి తన పనిని మొదలుపెట్టింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి కొరడా ఝుళిపించింది. ఏకకాలంలో కూకట్‌పల్లిలో, అమీన్‌పూర్‌ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేటలోని ఏకరంపైగా, పటేల్‌గూడలోని మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది. ఖచ్చితంగా, నీటి పారుదల, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి హైడ్రా బృందం కూల్చివేతలు చేపట్టారు. మూడు ప్రాంతాల్లోని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆకృతులు, భవనాలు తొలగించినట్లు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. అయితే తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు లబోదిబోమన్నారు. అప్పులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము హైడ్రా చర్యతో రూ.లక్షల్లో నష్టపోయి రోడ్డునపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.

దుర్గం చెరువు పరిధిలో బ్రేక్.. బాధితుల జాబితాలో సీఎం సోదరుడు

చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్ట్ స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై దుర్గం చెరువు పరిసర నివాసితులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు పరిసర నివాసితులు హాజరు కావాలని కోర్ట్ ప్రదర్శన. అభ్యంతరాలను తీసుకొని అక్టోబర్ 4 నుంచి ఆరు వారాలలోపు తుది నోటిఫికేషన్ జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిణామంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట దక్కినట్టు అయ్యింది.

అయితే, దుర్గం చెరువు పరిధిలో ఎఫ్‌టీఎల్, బజోన్‌లపై ఇటీవల హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ బాధితుల జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కూడా ఉన్నారు. దుర్గం చెరువు ఆక్రమణలపై నోటీసులు ఇవ్వగానే.. హైడ్రా కూల్చివేతలను ఆపేయాలంటూ కొందరు.. తమ నిర్మాణాలు కూల్చకుండా స్టే విధించి మరికొందరు హైకోర్టును ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మించిన పలు కట్టడాలకు హైడ్రా నోటీసులు జారీ చేయగా.. అక్కడి నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ తాత్కాలిక ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే, మాదాపూర్‌ అమర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలో సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. తిరుపతి రెడ్డు ఇల్లుతో పాటు కార్యాలయం కూడా దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన ఆ కట్టడాలను స్వచ్ఛందంగా తొలగించాలని స్పష్టం చేసిన అధికారులు.. 30 రోజుల గడువు కూడా ఇవ్వటం. ఈ నోటీసులపై స్పందించిన తిరుపతి రెడ్డి.. తాను ఉంటున్న ఎఫ్‌టీఎల్‌లో ఇల్లు ఉంటే హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని తెలిపారు. కాగా.. ఇప్పుడు హైకోర్టు స్టే విధించింది.. తిరుపతి రెడ్డికి భారీ ఊరట లభించినట్టయింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech