26
హైదరాబాద్‌లోని పలు ఐటీ దాడులు (ఐటీ రైడ్స్) ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే కూకట్పల్లి, బంజారాహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్‌లోని ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో పది బృందాలు పాల్గొంటున్నాయి.కూకట్‌పల్లిలోని రెయిన్బో విస్టాస్ ఐ బ్లాక్‌లోని ఫ్లాట్‌లో కిరాయికి ఉంటున్న బీఆర్కే న్యూస్ ఛానల్ అధినేత బొల్లా రామకృష్ణ నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. న్యూస్ ఛానల్‌తోపాటు ఫైనాన్స్, హాస్పిటల్, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆయన చేసారు. ఎనిమిది మంది అధికారులు ఆయన అపార్టుమెంటులో మొత్తం సోదాలు చేస్తున్నారు. ఆదాయ లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్‌ని పరిశీలిస్తున్నారు.