ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఢిల్లీ మెట్రో రైలు రూఫ్ పై స్వల్ప స్థాయిలో మంటలు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైషాలి వెళ్లే మెట్రో రైలు సోమవారం సాయంత్రం రాజీవ్ చౌక్ స్టేషన్లో ఆగినప్పుడు దాని రూఫ్ పై స్వల్పంగా మంటలు కనిపించాయి. ఈ ప్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైలు సంస్థ స్పందించింది. ఈ ప్రమాదకరమైనదేమీ కాదని వివరణ ఇచ్చింది. రైలు రూఫ్ పై వేలాడే తీగలు, దాన్నుంచి విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించేందుకు ఉంటే ఇనుప కడ్డీల పరికరం (పాంటోగ్రాఫ్) మధ్య ఏదైనా చిక్కుకుపోవడమో లేదా ఇరుక్కుపోవడమో జరిగినప్పుడు స్వల్ప మంట వస్తుందని ఓ ప్రకటనలో విద్యుత్ ప్రసారం. దీనివల్ల ఎటువంటి భద్రతా ముప్పు లేదా ప్రయాణికులకు ప్రాణాపాయం ఉండదని. అయితే దీనికి గల కారణంపై దర్యాప్తు చేపడతామని. కేవలం నిమిషాల తనిఖీల అనంతరం మిగిలిన పాంటోగ్రాఫ్ లతోనే రైలు గమ్యస్థానానికి బయలుదేరింది.
#చూడండి | రైలు పైకప్పు నుండి చిన్న మంటలు వెలువడుతున్న వైరల్ వీడియోను ప్రస్తావిస్తూ, ఈ సంఘటన ఈ రోజు సాయంత్రం 6:21 గంటలకు వైశాలి వైపు వెళ్తున్న రాజీవ్ చౌక్ స్టేషన్లోని రైలుకు సంబంధించినది అని స్పష్టం చేయడానికి ఇది జరిగింది: DMRC
ప్రస్తుత సంఘటన ఏమిటంటే… pic.twitter.com/i8To6qXgha
– ANI (@ANI) మే 27, 2024