Home సినిమా 35 చిన్నకథకాదు రికార్డుల మోత.. అంతా గాంధీ జయంతి మహత్యం – Sneha News

35 చిన్నకథకాదు రికార్డుల మోత.. అంతా గాంధీ జయంతి మహత్యం – Sneha News

by Sneha News
0 comments
35 చిన్నకథకాదు రికార్డుల మోత.. అంతా గాంధీ జయంతి మహత్యం


నిన్నుకోరి, జెంటిల్ మెన్, జై లవకుశ, వంటి సినిమాలతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ నివేదా థామస్(nivetha thomas)ఆమె ప్రధాన పాత్రలో నటించగా గత నెల సెప్టెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 35 చిన్నకథ కాదు(35 chinna katha kaadu)ఒక సరికొత్త పాయింట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ చాలా పెద్ద విజయాన్నే నమోదు చేసింది.చాలా రోజుల తర్వాత మంచి మెసేజ్ తో కూడిన ఎంటర్ టైన్మెంట్ మూవీని చూశామనే కితాబు ని కూడా ప్రేక్షకుల నుండి అందుకుంది.

రీసెంట్ గా 35 చిన్న కథ కాదు ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నుంచి ఓటి వేదికగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే వంద మిలియన్ల వ్యూయర్ షిప్ ని దక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య వచ్చిన చాలా చిత్రాలలో ఇదే హయ్యస్ట్ వ్యూయర్ షిప్ అని చెప్పవచ్చు.మరి రానున్న రోజుల్లో ఓటిటి వేదికగా ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.ఏ బిడ్డకైనా తల్లే మొదటి గురువుగా మారాలనే పాయింట్ ని అంతర్లీనంగా చెప్పిన ఈ మూవీలో నివేద థామస్ నటన ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఒక రకంగా చెప్పాలంటే కథ తన భుజస్కందాలపై మోసి తన క్యారక్టర్ ని ప్రతి గృహిణి కూడా ఒన్ చేసుకునేలా నటించింది.ఆమె భర్తగా విశ్వ దేవ్ అరుణ్ ప్రముఖ హీరో ప్రియదర్శి మ్యాథ్స్ టీచర్ గా అత్యద్భుతంగా నటించి సినిమా విజయంలో ఒక భాగస్వామ్యమయ్యాడు.చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన అరుణ్ దేవ్ కూడా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అలనాటి సీనియర్ హీరోయిన్ గౌతమీ తో పాటు ఒకప్పటి టాప్ హీరో, దర్శకుడు అయిన భాగ్యరాజ్ లు కూడా కీలక పాత్రలో నటించిన మూవీకి నిండు ధనాన్ని తీసుకొచ్చారు.రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై సృజన యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మాతగా నందకిషోర్ వహించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech