ముద్రణ.వీపనగండ్ల :- సొంత భవనాలు లేకపోవడంతో పాఠశాల ఆవరణలోని ఒకటే బీరువాలు అడ్డుపెట్టి రెండు అంగన్‌వాడీ సెంటర్లను నిలిపి ఉంచిన చిన్నారులు,పౌష్టికాహారం కోసం వచ్చే గర్భిణులు బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు.మండల పరిధిలోని తూముకుంట ప్రాథమిక పాఠశాల ఆవరణలోని ఒక గదిలో 2వ, 3వ తేదీన అంగన్‌వాడీ సెంటర్లను నిర్వహిస్తున్నారు. పాఠశాల ఆవరణలోని భవనాల్లోనే అంగన్‌వాడి సెంటర్ల నిర్వహణపై అధికారుల ఆదేశాలతో, సరిపోయిన గదులు లేకపోవడంతో ఒకే గదిలో రెండు అంగన్‌వాడి సెంటర్‌లను నిర్వహిస్తున్నారు. రెండవ అంగన్‌వాడి సెంటర్‌లో ఆరుగురు చిన్నారులు, మూడవ అంగన్‌వాడి సెంటర్‌లో 13 మంది చిన్నారులు యంటున్నారు. అంగన్వాడీ టీచర్లకు ఒకటే గదిలో చిన్నారుల ఆలనా పాలన, చదువు చెప్పటం ఇబ్బందిగా మారడంతో, మరో సెంటర్ టీచర్ బయట వరండాలో కూర్చోబెట్టి వారి ఆలనా పాలన చూస్తుంది.
అంగన్‌వాడి కేంద్రాలకు వచ్చే చిన్నారులతోపాటు,గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం వడ్డించడం ఇరుకు గదిలోనే జరుగుతుంది. అంగన్వాడి కేంద్రాల్లోని గ్యాస్ స్టవ్, గిన్నెలను భద్రపరచుకోవడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని . అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఒకే గదిలో రెండు సెంటర్ల నిర్వహణ కష్టతరంగా మారిందని అంగన్‌వాడీ టీచర్లు తెలిపారు. అంవాడి సెంటర్లకు సొంత భవనాలు నిర్మించాలని పలుమార్లు ప్రజా ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మండల పరిధిలోని పలు అంగన్వాడీ సెంటర్లలో సమస్యలు జటిలంగా ఉన్న టీచర్లు పై అధికారులకు చెప్పేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు. అంగన్‌వాడి సెంటర్‌లో నెలకొన్న సమస్యలను బయట పెడితే తమపై పని ఒత్తిడి మరింత పెంచడానికి ఎన్ని సమస్యలు వచ్చినా పోల్చుకొని పోతున్నామని కొందరు అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. సొంత భవనాలు లేక ఇరుకు గదుల్లోనే నెట్టుకొస్తున్నామని, సెంటర్‌లో మూత్రశాలలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని సామాన్లు భద్రపరిచేందుకు ప్రత్యేక గదులు లేకపోవడం వల్ల ఒకే గదిలో నిర్వహణ వస్తుందని ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి అంగన్‌వాడి నూతన భవనాలు నిర్మించాలని కోరుతున్నారు.