36
ముద్ర,సెంట్రల్ డెస్క్:-కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఘన విజయం సాధించారు. ఎన్డీఏ కూటమికి తొలి విజయాన్ని కట్టబెట్టారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసిన అమిత్ షా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్ భాయ్ పటేల్ మీద 4.10 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అమిత్ షాకు మొత్తంగా 5.26 లక్షల ఓట్లు పోలవగా.. ఆయన ప్రత్యర్థి రమణ్ భాయ్ పటేల్ కు 1.15 లక్షల ఓట్లు దక్కాయి.