Home తెలంగాణ ప్రక్షాళన దిశగా మూసీ..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

ప్రక్షాళన దిశగా మూసీ..! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
మూసీ టెన్షన్... కూల్చివేతలకు స్పెషల్ టీంలు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • 1,350 మంది మూసీ నిర్వాసితులకు హైడ్రా నోటీసులు
  • 28, 29 తేదీల్లో కూల్చివేతలు
  • రంగంలో మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు
  • నిర్వాసితులను ఒప్పించేలా వారితో చర్చలు
  • నగరశివారులో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ లో కీలక ముందడుగు పడింది. ఆ నదిని ప్రక్షాళన చేసి పరిసర ప్రాంతాలను సుందరీకరించడం ద్వారా విదేశీ పర్యటకులూ సందర్శించేలా ప్రణాళికలు రూపొందించిన రాష్ట్ర సర్కార్..ముందుగా క్షేత్రస్ధాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి వడివడిగా అడుగులేస్తోంది. కాగా ఇప్పటికే అక్కడ నిర్మాణాలు కూల్చేందుకు వెళ్లిన హైడ్రా అధికారులను అడ్డుకున్న స్ధానికులు తమకు పునరావాసం కల్పించిన తర్వాత తమ నివాసాలు కూల్చాలని డిమాండ్ చేశారు. అయితే ఏకకాలంలో వందలాది మంది ఆశ్రయం కోల్పోతున్నారని భావించిన సర్కార్.. మూసీ పరివాహన ప్రాంతంలో నివసించే కుటుంబాలను లెక్కించేందుకు సర్వే నిర్వహించింది. ఈ మేరకు అక్కడ 1,350 కుటుంబాలు ఉన్నాయని సర్వే అధికారులు తేల్చారు. మరోవైపు… ఇప్పటికే వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకారం ప్రభుత్వం ఈ నెల 24న 16,20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చింది. మరోవైపు మరుసటి రోజే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు బుధవారం నిర్వాసితులందరికీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో అక్కడున్న నిర్మాణాలు కూల్చివేస్తామని నోటీసుల్లో స్పష్టం చేసింది. అయితే నిర్వాసితులు తమకు ఇళ్లు కేటాయించిన తర్వాతే ఇక్కడ నుంచి కదలుతామని స్పష్టం చేశారు. అప్పటి వరకు కదిలేది లేదని భీష్మించుకున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాలున్న మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లను రంగంలోకి దింపింది. క్షేత్రస్ధాయిలో ఉంచిన మూసీ నిర్వాసితులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామనే భరోసా కల్పించాలని, ఆ ప్రక్రియ తుది దశలో ఉందని సూచించాలని సూచించారు. దీంతో రంగంలోకి దిగిన ఆయా జిల్లాల కలెక్టర్లు వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.

అమీన్ పూర్ లో హైడ్రా దూకుడు..!

అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి ఎన్ని ఆరోపణలు, విమర్శలు వెలువెత్తుతోన్నా హైడ్రా ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ మేరకు బుధవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పెద్దచెరువును హైడ్రా అధికారులు రీసర్వే చేశారు. గతంలో ఇక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా అధికారులు.. గోల్డెన్ కీ, వాణీనగర్, హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీ, వెంకటరమణ కాలనీలో అధికారులు కలిసి సర్వే చేశారు. ఈ నవ్య చౌరస్తాలో అక్రమంగా కట్టిన భవనాన్ని కూల్చివేశారు.

ఫిర్యాదులతో రంగంలో హుడ్రా..!

పెద్దచెరువు కబ్జా చేసి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఇళ్లు కట్టారని హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో చెరువు పరిధిలో పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఇదే ప్రాంతంలో నిర్మాణాలు కూల్చి మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. అలాగే అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలో ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం భవనాలను నిర్మించినట్లు హైడ్రా గుర్తించింది. కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో వాణిజ్యపరంగా 3 ఐదంతస్తుల భవనాలను కూల్చివేశామని, అక్కడ ఏకరం ప్రభుత్వ గుర్తింపు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది. పటేల్‌గూడలోని సర్వే నెంబర్ 12/2, 12/3లోని ప్రభుత్వ గుర్తింపు ఆక్రమించి 25 నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని హైడ్రా గుర్తించారు. వాటిని తొలగించి 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు. పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని 51లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారు. అలాగే రోడ్లను సైతం ఆక్రమిస్తూ పద్మావతి నగర్‌లో ఏర్పాటు చేసిన అక్రమాస్తుల ప్రహరీ గోడతో పాటు రెండు సెక్యూరిటీ గదులను హైడ్రా అధికారులు తొలగించారు. అమీన్‌పూర్‌లో ఓప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ, ఆట ప్రదర్శన హైడ్రా నేలమట్టం చేసింది. ప్రొక్లెయిన్ సాయంతో ప్రహరీని కూల్చి దాదాపు 15 గుంటల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్‌ 462లో 38 గుంటల ప్రభుత్వ భూమిలో వెలసిన వాహనాలను తొలగించారు. ఆ దుకాణాలు మున్సిపల్ మున్సిపల్ చైర్మన్‌ పాండురంగారెడ్డివిగా గుర్తించిన అధికారులు అతనిపై చర్యలకు ఉపక్రమించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech