27
ముద్ర,సెంట్రల్ డెస్క్:-భారతదేశంలో అత్యంత సంపన్న గ్రామాలు ఉన్న రాష్ట్రంగా కేరళ. తాజాగా నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్.ఎస్.ఎస్) ఆఫీస్ విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ నివేదిక ఈ పరిశీలన తెలియజేసింది. వస్తువులు మరియు సౌకర్యాలపై కేరళలో ఒక ఇంటి సగటు నెలవారీ ఖర్చు రూ.5924.
కాగా అత్యంత సంపన్న పట్టణ ప్రాంతాలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణాగా నిలిచింది. తెలంగాణ పట్టణ ప్రాంతాలు రూ.8158 నెలవారీ వినియోగ వ్యయంగా ఉంది. గత 10 సంవత్సరాల(2012 నుండి 2023 వరకు) సంఘటనకు సంబంధించిన నివేదికను ఎన్.ఎస్.ఎస్ విడుదల చేసింది. కేరళలో సిపిఎం ఆధ్వర్యంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు వంటి రంగాలలో సాధిస్తున్న విజయాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి.