ముద్ర.వీపనగండ్ల :- ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయులచే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నమ్మకంతో తన కుమారుడిని, కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్చి తోటి ఉద్యోగస్తులకు ఆదర్శంగా నిలిచారు వీపనగండ్ల ఎస్ఐ కే రాణి. వీపనగండ్ల పోలీస్ స్టేషన్‌లో ఇటీవల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రాణి తన భర్త తిరుమలేష్‌తో కలిసి కుమార్తెను వీపనగండ్లలోని మూడవ అంగన్‌వాడి సెంటర్‌లో,కుమారుడు విరాట్ నందన్ ను ఎంఆర్‌సీ ప్రాథమిక పాఠశాలలో చేర్చారు.ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య బోధించడం జరుగుతుందని,అంగన్వాడి సెంటర్‌లో ఆటపాటలతో బోధించడం జరుగుతుందని ఎస్సై కె, రాణి భర్త తిరుమలేష్ పిల్లల ను చేర్చారు.
ఈసందర్భంగాసాయి రాణి అంగన్‌వాడి ఎస్‌చార్ట్, బోర్డులను తిలకిస్తూ సెంటర్ పరిసరాలను పరిశీలించారు.ఎస్‌ఐ మాట్లాడుతూ తాను చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదవడం, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను బోధించడం జరుగుతుందని,తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలలను చేర్పించాలని కోరారు. అంగన్‌వాడి సెంటర్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని ఎస్సై సంతోషం వ్యక్తం చేశారు. ఎస్సైని స్ఫూర్తిగా తీసుకొని పాఠశాలలో వివిధ శాఖల అధికారులు కూడా తమని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో అంగన్‌వాడి సూపర్‌వైజర్, అంగన్‌వాడీ టీచర్ కమల, ఆయా రాధమ్మ ఉన్నారు.