ముద్ర, తెలంగాణ బ్యూరో : చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణపతకాలు సాధించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి రూ.25 లక్షల చొప్పున పోత్సాహకాలను ప్రకటించారు. భారతదేశం తరపున తొలిసారి స్వర్ణపతకాలు సాధించిన క్రీడాకారులు అర్జున్, ద్రోణవల్లి హారిక జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారిని అభినందించిన సీఎం రూ.25 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఉన్నారు. కాగా హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ప్రతిష్ఠాత్మక 45వ చెస్ ఒలింపియాడ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. టైటిల్ కోసం 190కి పైగా దేశాలు పోటీ బరిలోకి దిగాయి. దేశ విదేశాల కోసం ప్రపంచ అగ్రశ్రేణి ప్లేయర్లు తలపడ్డారు. అయితే ఈ చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తొలిసారి స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించాయి.