మూవీ : స్త్రీ2
నటీనటులు: శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా, తమన్నా, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్
ఎడిటింగ్: హేమంతి సర్కార్
సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్జీ
మ్యూజిక్: సచిన్ జిగర్, జస్టిన్ వర్గీస్
నిర్మాతలు: దినేశ్ విజన్, జ్యోతి దేశ్ పాండే
దర్శకత్వం: అమర్ కౌశిక్
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
కథ:
చందేరీ గ్రామంలో వరుసగా అమ్మాయిలు కనపడకుండా పోతారు. ఇక వాళ్ళంతా ఎలా మిస్ అవుతున్నారనే కారణంతో ఊర్లోని వాళ్ళంతా టెన్షన్ పడతారు. మరోవైపు అదే గ్రామంలో విక్కీ( రాజ్ కుమార్ రావు) ఉంటాడు. విక్కీ ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. అదే సమయంలో ‘ అతను మళ్ళీ వస్తున్నాడు’ అంటూ చందేరీ పురాణంలోని కొన్ని పేజీలతో కూడిన ఓ కవర్ రుద్ర(పంకజ్ త్రిపాఠి)కి అందుతుంది. అదే సమయంలో బిట్టు(అపర్ శక్తి ఖురానా) ప్రేమికురాలు చిట్టీ(అన్య సింగ్) ని సర్కట అనే దెయ్యం తీస్తుంది. దాంతో చిట్టీని కాపాడేందుకు విక్కీ, బిట్టు, రుద్ర, జన రంగంలోకి దిగుతారు. మరి వాళ్ళంతా కలిసి చిట్టిని ఆ దెయ్యం బారి నుండి కాపాడారా? అసలు సర్కట అనే దెయ్యం గతమేంటో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
హారర్ ప్లస్ కామెడీ అనేది కొన్నింటికే సెట్ అవుతుంది. మన తెలుగులో ‘కాంచన’ సీక్వెల్ లో కామెడీతో పాటు హారర్ జనాలకి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు అదే కోవలోకి స్త్రీ2(స్త్రీ2) చేరింది.
మొదటి పార్ట్ హిందీ బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్ళని. అయితే మొదటి భాగంలో ఒక స్త్రీ వల్ల ఊరిలోని వాళ్ళంతా చనిపోతుంటారు. కానీ ఈ సెకెండ్ పార్ట్ లో సర్కట అనే ఓ మగ దెయ్యం వల్ల ఆడవాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. దాని నుండి ఊరిని కాపాడటానికి హీరో, హీరోయిన్ తో పాటు వాళ్ళ సన్నిహితులు పడే కష్టం ప్లస్ అమాయకత్వం, చేసే పనులు ఆడియన్ కి నవ్వు తెప్పిస్తాయి.
పార్ట్ వన్ హిట్ అంటే పార్ట్ టూ లో అదే సక్సెస్ ని అందుకోవడం చాలా కష్టం ’ కానీ దర్శకుడు అమర్ కౌశిక్.. ఎక్కడ బోర్ కొట్టకుండా చివరి వరకు ఎంగేజ్ చేస్తూ వెళ్ళాడు. అటు కథని ఇట స్క్రీన్‌ప్లేని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడు. ఇక కథతో పాటు వచ్చే కామెడీ కూడా క్లీన్ గా ఉండేలా చేసుకున్నాడు. ఎక్కడ విసుగుతెప్పకుండా కథలో నుండి బయటకు వెళ్ళకుండా అందులోనే లీనం చేయడంలో దర్శకుడు అమర్ కౌశిక్ సక్సెస్ అయ్యాడు. అసభ్య పదజాలం వాడలేదు. ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ తీశారు.
ఈ లాంగ్ వీకెండ్‌లో మంచి ఫ్యాన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన మూవీ “స్త్రీ 2” (స్ట్రీ 2). కామెడీ, మ్యూజిక్, లాజిక్ సరిసమానంగా కలగలిసిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. కలిసి చూస్తే ఇంకాస్త ఎక్కువ ఫ్యాన్ ఉంటుంది. విఎఫ్ఎక్స్ సినిమాకి అదనపు బలం. ఎడిటింగ్ నీట్ గా ఉంది. మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలవలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
బిట్టుగా అపరశక్తి ఖురానా, విక్కీగా రాజ్ కుమార్ రావు, చిట్టీగా అన్య సింగ్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. స్పెషల్ సాంగ్ లో తమన్నా భాటియా ఆకట్టుకుంది.
ఫైనల్ గా: నవ్వులు పంచే హారర్ స్త్రీ2. మస్ట్ వాచెబుల్.
✍️. దాసరి మల్లేశ్