46
టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒక కార్గో విమానం లాండింగ్ గేర్ చెడిపోవడంతో ఎమర్జెన్సీ లాండింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విమానం రన్ వేపై దిగుతుండగానే, నేలకు రాసుకుంటూ దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానం ముందుభాగం రన్ వేకు రాసుకుంటూ పోవడంతో మంటలు వచ్చాయి. అయితే ఈ విమానంలోని సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.