Home తెలంగాణ సాహితీ’ఎండీకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

సాహితీ’ఎండీకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sneha News

by Sneha News
0 comments
సాహితీ'ఎండీకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • చంచల్ గూడకు తరలింపు
  • తమ కస్టడికి అప్పగించాలంటూ ఈడి పిటీషన్ ఫైల్
  • రియల్ ఎస్టేట్ పేరుతో 3వేల మందికి రూ.2500 కోట్ల టోకరా
  • సాహితీ ఇన్‌ఫ్రాపై 50కి పైగా కేసులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : సాహితీ ఇన్‌ఫ్రా మేనెజింగ్ డైరెక్టర్ బుదాటి లక్ష్మీనారాయణకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించిన ఈడీ అధికారులు తమకు 14 రోజుల పాటు కస్టడికి అప్పగించాలని పిటిషన్ వేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మూడు వేలకు పైగా మందిని మోసం చేసి రూ. 2,500 కోట్లు టోకరా వేసిన ఆ కంపెనీ వ్యవహారంలో మనీలాండరింగ్‌ని గుర్తించినట్లు ఈడీ కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ మేరకు లక్ష్మీనారాయణను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్న ఈడీ సోమవారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించింది. వివరాల్లోకి వెళితే.. రియల్ ఎస్టేట్ పేరుతో 3వేలకు పైగా మందిని మోసం చేసిన సాహితీ ఫ్రా బోర్డు తిప్పేసింది. ప్రీ లాంచ్‌ ఆఫర్‌ పేరుతో ఊ. 2,500 కోట్లు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సాహితి మాయలో మోసపోయామని బాధితులు 2022లో హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.బాధితులిచ్చిన ఫిర్యాదుతో సీసీఎస్‌ పోలీసులు సాహితి ఎండిపై 50కి పైగా కేసులు నమోదు చేశారు. ఈ వరకు ఇప్పటి వరకు సుమారు రూ. 200కోట్ల ఆస్తులను సీసీఎస్ పోలీసులు అటాచ్ చేశారు. మరోవైపు సాహితీ ఇన్‌ఫ్రా కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

9 ప్రాజెక్టులు రూ.2,500 కోట్లు..!

సాహితీ ఇన్ఫ్రా మొత్తం తొమ్మిది ప్రాజెక్టుల పేరుతో ప్రజల నుంచి రూ. 2,500 కోట్లు వసూలు చేసింది. సాహితీ స్వాద్‌ పేరుతో రూ.65 కోట్లు, సిస్టాఅడోబ్‌ పేరుతో రూ.79 కోట్లు, సాహితీ గ్రీన్‌ పేరుతో రూ.40 కోట్లు, సాహితీ సితార పేరుతో రూ.135 కోట్లు,సాహితీ మెహతో పేరుతో రూ.44 కోట్లు,ఆనంద ఫర్చూన్ పేరుతో రూ.45 కోట్లు, సాహితీ కృతి పేరుతో రూ.45 కోట్లు రూ.16 కోట్లు, సాహితీ సుదీక్ష పేరుతో రూ.22 కోట్లు, రూబికాన్ సాహితీ పేరుతో రూ.7 కోట్లు ఇలా ఇంకొన్ని పేర్లతో కోట్లు దండుకున్నది. వసూలు చేసిన డబ్బులతో భూములు కొనుగోలు చేయకున్నా ఫ్రీలాంచ్‌ పేరుతో వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఏపీలోనూ…

గతంలో ఏపీలోను సాహితీఫ్రాన్స్ యజమాని బుదాటి లక్ష్మీనారాయణపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో పాటు ఆస్తులను అటాచ్ చేశారు. కోట్లల్లో మోసం జరగడంతో సీఎస్ పోలీసులు కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన పోలీసులు లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసి అతడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సాహితీ ఇన్‌ఫ్రా లక్ష్మీ నారాయణను ఈడీ కార్యాలయానికి తీసుకున్న అధికారులు విచారణను పరిశీలించారు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech