అగ్ర దర్శకుడు సుకుమార్(సుకుమార్)దగ్గర చాలా సినిమాలకి దర్శకుడిగా పని చేసి నాచురల్ స్టార్ నాని(నాని) దసరా(దసరా)తో దర్శకుడిగా మారాడు శ్రీకాంత్ ఓదెల(srikanth odela)దర్శకుడుగా చేసిన తొలి సినిమాకే పలు విభాగాల్లో నేషనల్ అవార్డును పొంది అరుదైన ఘనతను సాధించాడు. తోనే తన రెండో మూవీ కూడా చెయ్యబోతున్నాడు.
రీసెంట్ గా కొండ సురేఖ తన రాజకీయపరమైన గొడవల్లోకి సమంత పేరు తీసుకురావడంపై శ్రీకాంత్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. రంగస్థలం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసే సమయంలో మూడువందల అరవై ఐదు రోజుల పాటు సమంత మేడంని దగ్గరగా చూసిన ఒక అభిమానిగా చెప్తున్నాను. ఆమె సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం. ఒక ఆర్టిస్ట్‌గానే కాదు, ఒక వ్యక్తిగా కూడా తను ఒక అక్కయ్య లా అనిపించేవారు. నాకు సురేఖ గారి గురించి కానీ, సమంత మేడం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. కానీ సురేఖ గారు మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదు.
గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అసహ్యకరమైన కామెంట్స్ వినడం నిజంగా బాధగా ఉంది. పదవి, అధికారం ఉన్నా గౌరవాన్ని కొనలేరు. సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళ తన కలలను సాకారం చేసుకుంటూ ఎదగాలంటే చాలానే అవరోధాలు ఉంటాయి. ఇలాంటి అవమానకరవ్యాఖ్యలు ఆ భయాలను మరింత పెంచుతాయి. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు,ప్రతి చోట లింగ సమానత్వం ఉంది. మహిళలందరూ దీనిని ఖండించాలి. బతుకమ్మ అంటేనే ఆడది అంటారు. అలాంటి బతుకమ్మ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి వివాదాన్ని తీసుకురావడం చాలా ఇబ్బందికరం. శ్రీకాంత్ ఓదెల స్వస్థలం కరీంనగర్ జిల్లా గోదావరి ఖని.ఆ నేపథ్యంలోనే దసరా మూవీని నిర్మించాడు.