Home సినిమా కొండా సురేఖ వల్ల అక్కినేని నాగేశ్వరరావు ఆత్మ క్షోభిస్తుంది – Sneha News

కొండా సురేఖ వల్ల అక్కినేని నాగేశ్వరరావు ఆత్మ క్షోభిస్తుంది – Sneha News

by Sneha News
0 comments
కొండా సురేఖ వల్ల అక్కినేని నాగేశ్వరరావు ఆత్మ క్షోభిస్తుంది


మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు(anr)తెలుగు సినిమా ఒడిలో ఎదిగాడు అనే కంటే, తెలుగు సినిమానే ఆయన వల్ల ఎదిగిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేశానికి స్వాతంత్య్రం రాక ముందే 1942 లో ధర్మపత్ని అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన అక్కినేని దాదాపు రెండు వందల యాభై ఐదు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి కోట్లాది మంది అభిమానులను సంపాదించాడు.

స్టూడియో అధినేతగా, నిర్మాతగా కూడా విశేష సేవలందించడంతో పాటు పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే లాంటి ప్రతిష్టాత్మక అవార్డులను పొంది తెలుగు సినిమా కీర్తిని కూడా పెంపొందించాడు. నాగార్జున(nagarjuna)నాగ చైతన్య(naga chaitanya)అఖిల్(akhil)సుమంత్, సుశాంత్, సుప్రియ వంటి తారల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి కళామతల్లి రుణం కూడా తీర్చుకున్నాడు. అలాంటి మహోన్నత వ్యక్తి కుటుంబం మీద తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన నిరాయుధమైన వ్యాఖ్యలతో అక్కినేని ఆత్మ క్షోభిస్తుందనే మాటని ప్రతి ఒక్కరు వ్యక్తపరుస్తున్నారు.

ఇక కొండా సురేఖ(konda surekha)వ్యాఖ్యలని ఖండిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అభిమానులు సురేఖ దిష్టి బొమ్మని దగ్ధం చేస్తూ సురేఖ కి వ్యతిరేఖంగా నిరాశని వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech