69
కర్ణాటక బీజేపీ రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రామనగర జిల్లా కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో అత్యాచార ఘటన జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే మునిరత్న సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.