ముద్ర,సెంట్రల్ డెస్క్:- పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో భారత క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభాన్ని ఇచ్చింది. ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ 64వ రౌండ్లో ఆకుల శ్రీజ 11-4, 11-9, 11-7, 11-8 తేడాతో స్వీడన్‌కు చెందిన క్రిస్టీనాను ఓడించి విజయం సాధించింది.30 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీజ ఆట తన చేతుల్లోకి తీసుకుంది.
మహిళల సింగిల్స్ రౌండ్ 64లో స్వీడన్ క్రీడాకారిణి క్రిస్టినా కల్బర్గ్పై 11-4 11-7 11-9 11-8 తేడాతో భారత అగ్రశ్రేణి పాడ్లర్ శ్రీజ అకుల అద్భుత విజయం సాధించింది. pic.twitter.com/jRe3HxGHG6
— SAI మీడియా (@Media_SAI) జూలై 28, 2024
4-0 తో క్రిస్టీనాను తెలుగు తేజం శ్రీజ చిత్తు చేసింది. 32వ రౌండ్లో ఆకుల శ్రీజ జియాన్ జెంగ్ లేదా ఇవానా మలోబాబిక్తో తలపడనుంది. తొలిసారి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఆకుల శ్రీజ ఈసారి దేశానికి ఎలాగైనా పతకాన్ని తీసుకురావాలని గట్టి కసి మీద ఉంది.