సంక్రాంతి కానుకగా ఈ నెల14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం'(sankranthiki Vasthunnam).విక్టరీ వెంకటేష్(Venkatesh)ఐశ్వర్య రాజేష్(iswarya Rajesh)మీనాక్షిచౌదరి(మీనాక్షి చౌదరి)హీరో,హీరోయిన్లుగా నటించారు అనిల్ రావిపూడి(అనిల్ రవిపూడి) ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది.దీంతో తొలి వారమే 200 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త కలెక్షన్ల సునామీకి అంకురార్పణ చేసిందని చెప్పవచ్చు. అన్ని ఏరియాలకి సంబంధించిన థియేటర్లలో పలు రికార్డులు నమోదు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది.
ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లోని మండపేట కి చెందిన ఒక థియేటర్ లో బాహుబలి 2(బాహుబలి 2)రికార్డులకి చెక్ పెట్టింది. ఫస్ట్ వీక్ లో బాహుబలి 2 53 .25 లక్షలు సాధించగా,సంక్రాంతికి 65.62 లక్షలు వచ్చాయి.ఇదే థియేటర్ లో 2 టోటల్ లాంగ్ రన్ లో 90 లక్షలని రాబట్టింది.మరి ఈ లెక్కన ‘సంక్రాంతికి వస్తున్నాం’ కేవలం పది రోజులలోనే బాహుబలి 2 లాంగ్ కలెక్షన్స్ ని క్రాస్ చేయడం ఖాయం. వీకెండ్ కూడా ఉండటం సంక్రాంతికి వషున్నాం కి ప్లస్ పాయింట్.మరి ఈ లెక్కన లాంగ్ రన్ లో ఒక్క మండపేట థియేటర్ లోనే సంక్రాంతికి వస్తున్నాం కోటి రూపాయిలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నారు.
ఒక్క మండపేట అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో సంక్రాంతికి వస్తున్న కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి పోటెత్తుతోంది.అందుకే కలెక్షన్స్ ఎక్కడ ఆగడంలేదు.వెంకీ,అనిల్,దిల్ రాజు(దిల్ రాజు)కెరీర్‌లోనే వేగంగా 200 కోట్ల మైలు రాయిని అందుకున్న మూవీ కూడా నిలిచిపోయింది. సంక్రాంతికి రానున్న రోజుల్లో ఎంత మేర కలెక్షన్స్ సాధిస్తుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.