ప్రముఖ హీరోయిన్ నిత్య మీనన్(Nithya menen)సినీ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.బాలనటిగా ‘హనుమాన్’ అనే ఇంగ్లీష్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన నిత్య ఆ తర్వాత 2008లో ‘ఆకాశ గోపురం’ అనే మలయాళతో సోలో హీరోయిన్ గా మారింది.అక్కడ్నుంచి మళయాళంతో పాటు తెలుగు,తమిళ ,కన్నడ,హిందీ చిత్రాల్లో నటిస్తు అశేష అభిమానులని అలరిస్తూ వస్తుంది.ఇటీవలే జాతీయ అవార్డుని కూడా గెలుచుకొని నటిగా ఎంతో ఉన్నత స్థానంలో ఉంది.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నిత్యం మాట్లాడింది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ‘జయలలిత’ గారి బయోపిక్ చెయ్యాలని ఎంతగానో ఆశపడ్డాం.చర్చలు కూడా జరిగాయి.కానీ ఈ లోపు జయలలిత గారి బయోపిక్ ఆధారంగానే ‘తలైవి’ అనే సినిమా వచ్చింది.మళ్ళీ చేస్తే రిపీట్ అవుతుందని అనుకున్నాం.కానీ మా నాన్న ఎలాగైనా జయలలిత బయోపిక్. పిక్ చెయ్యమంటే చేద్దామని అనుకున్నాను.మళ్ళీ ఈ లోపే ‘క్వీన్’ అంటే మరో జయలలితగారి బయోపిక్‌కి సంబంధించిన వెబ్ సిరీస్ వచ్చింది.దీంతో ఇక రిపీట్ అవుతుందని ఆ ప్రయత్నం మానుకున్నాను.
నిజానికి నాకు సినిమా రంగం అంటే ఇష్టం లేదు.ఒత్తిడి ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలనేది నా కోరిక.ఇండస్ట్రీలోకి వచ్చాక వేరే రంగంలోకి వెళ్లిపోవాలని అనుకున్నాను.కానీ జాతీయ అవార్డు నా దృక్పధాన్ని మార్చేసి నాకో కొత్త దారిని చూపించిందని చెప్పుకొచ్చింది.నిత్య మీనన్ రీసెంట్ గా కాదలిక్క నెరమిల్లే అనే తమిళ మూవీలో జయం రవితో కలిసి నటించింది. జనవరి 14 న ఆ మూవీ రిలీజ్ అవ్వగా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.