Home సినిమా ఆర్ సి 16 పుష్ప 2 డేట్ కే రిలీజ్? – Sneha News

ఆర్ సి 16 పుష్ప 2 డేట్ కే రిలీజ్? – Sneha News

by Sneha News
0 comments
ఆర్ సి 16 పుష్ప 2 డేట్ కే రిలీజ్?


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(రామ్ చరణ్)సంక్రాంతి కానుకగా,జనవరి 10న ‘గేమ్ చేంజర్'(గేమ్ ఛేంజర్)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా,డ్యూయల్ రోల్ లో చరణ్ నటించిన నటనకి మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు. చరణ్ ‘ఉప్పెన’మూవీ ఫేమ్ బుచ్చిబాబు(బుచ్చిబాబు)తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.చిత్ర బృందం అధికారకంగా ప్రకటించబడినా, పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో మూవీపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ హైప్ నెలకొని ఉంది.

గత ఏడాది పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ఇప్పటికే మైసూర్ లో షూటింగ్ జరుపుకుంది.ఆ తర్వాత షూటింగ్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.పైగాచరణ్ గేమ్ చెంజెర్ ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి వచ్చింది.ఇక ఇప్పుడు ఆ హడావిడి లేకపోవడంతో చరణ్ ఆర్ సి 16 షూట్ లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు. 27 న ప్రారంభం కానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఈ షెడ్యూల్ నుంచి ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో త్వరగా, షూటింగ్ ని కాంప్లీట్ చెయ్యాలని కూడా మేకర్స్ ఊహించినట్లు తెలుస్తుంది.దాదాపు జూలై నెలలో మొత్తం షూట్ పూర్తి చేసి,దసరా లేదా డిసెంబర్ నెలలో రిలీజ్ కి ప్లాన్ చేయాలని చూస్తున్నారనే రూమర్స్ కూడా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

ఇక ఈ చిత్రం ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(Ar rehman)సంగీతాన్ని అందించాడు.వృద్ధి సినిమాలు, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు.మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)రీసెంట్ పుష్ప 2(పుష్ప 2)తో పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటారు. ఆ మూవీ డిసెంబర్ 5న విడుదలైంది.దీంతో సెంటిమెంట్ గా చరణ్ సినిమాని కూడా అదే డేట్ కి రిలీజ్ చేస్తారేమో అంటే. టాక్ కూడా సినీ సర్కిల్స్ లో వినపడుతుంది. చరణ్ సరసన దేవర(Devara)ఫేమ్ జాన్వీ కపూర్(Janhvi kapoor)హీరోయిన్ గా చేస్తుండగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Sivarajkumar)జగపతిబాబు(Jagapathibabu)కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech