టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన మొదటి హీరోగా చిరంజీవి (చిరంజీవి) రికార్డు సృష్టించారు. ‘సైరా నరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో రెండు సార్లు ఆయన ఈ ఫీట్ సాధించారు. చిరంజీవి తర్వాత సీనియర్ స్టార్స్ లో ఈ ఫీట్ సాధించే సత్తా బాలకృష్ణ (బాలకృష్ణ)కు ఉందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా బాలకృష్ణ కంటే ముందే వెంకటేష్ (వెంకటేష్) ఈ ఫీట్ సాధించబోతున్నారు.
‘ఎఫ్-2’, ‘ఎఫ్-3’ తర్వాత వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.160 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, త్వరలోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమైంది. అదే జరిగితే సీనియర్ స్టార్స్ లో చిరంజీవి తర్వాత ఈ ఫీట్ సాధించిన హీరోగా వెంకటేష్ నిలిచారు. (సంక్రాంతికి వస్తునం)
మరోవైపు ఈ సంక్రాంతి కానుకగా బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ కూడా విడుదలైంది. ఈ సినిమా ఇప్పటిదాకా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టగా, త్వరలోనే రూ.150 కోట్ల మార్క్ అందుకోనుంది. ఫుల్ రన్ లో రూ.200 కోట్ల మార్క్ అందుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ ఈ సినిమాతో మిస్ అయినా, నెక్స్ట్ వచ్చే ‘అఖండ-2’తో బాలకృష్ణ 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.