Home ఆంధ్రప్రదేశ్ ఏపీలో పంజా విసురుతున్న క్యాన్సర్ మహమ్మారి.. వంద మందిలో ఒకరికి క్యాన్సర్ లక్షణాలు – Sneha News

ఏపీలో పంజా విసురుతున్న క్యాన్సర్ మహమ్మారి.. వంద మందిలో ఒకరికి క్యాన్సర్ లక్షణాలు – Sneha News

by Sneha News
0 comments
ఏపీలో పంజా విసురుతున్న క్యాన్సర్ మహమ్మారి.. వంద మందిలో ఒకరికి క్యాన్సర్ లక్షణాలు


ప్రపంచ వ్యాప్తంగా గడిచిన కొన్నాళ్లుగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో ఈ కేసుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల కింద క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ను రాష్ట్రంలో ప్రారంభించింది. ఇంటింటికి వెళ్లి ప్రాథమిక దశలో క్యాన్సర్ గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలను అందించే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పరీక్షల్లో ప్రతి వంద మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా తేలడం ఆందోళన కలిగిస్తోంది. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇప్పటి వరకు 53,07,448 మందికి వైద్య పరీక్షలు జరిగాయి. వీరిలో 52,221 మంది క్యాన్సర్ అనుమానితులుగా ఆరోగ్యశాఖ గుర్తించింది. రాష్ట్రంలో గడిచిన ఏడాది నవంబర్ 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రభుత్వం ప్రారంభించింది. 10 నెలలపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 19,447 మందికి నోటి క్యాన్సర్, 15, 401 మందికి రొమ్ము క్యాన్సర్, 17,373 మందికి గర్భాశయ ముఖ ద్వార కాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నాయని ఆరోగ్యశాఖ గుర్తించింది. రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ఈ మహమ్మారికి బలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ద్వారా క్యాన్సర్ చికిత్సలకు 2019-20లో రూ.217 కోట్లు ఖర్చుపెట్టగా, 2023-24లో రూ.624 కోట్లకు పెరిగిందని ఆరోగ్యశాఖ అధికారులు.

ఈ వ్యాధిని కట్టడి చేయడానికి వీలుగా ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 18 ఏళ్ల పైబడిన వారికి నోటి రొమ్ము క్యాన్సర్, 30 ఏళ్ల పైబడిన మహిళలకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతోంది. విస్తృతంగా చేపడుతున్న స్క్రీనింగ్‌లో 155 మంది జిల్లా ప్రత్యేక వైద్యులు, 238 మంది ఆసుపత్రుల నిపుణులు, 394 మంది వైద్యాధికారులు, 10,032 మంది సామాజిక ఆరోగ్య అధికారులు ఉన్నారు. ముందుగా ఆశ కార్యకర్తలు కరపత్రాలతో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏఎన్ఎం, సీపీవోలు.. మహిళలు సర్వేకల్ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించారు. ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఆరోగ్య కేంద్రం స్థాయిలో జరిపే స్క్రీనింగ్‌లో వైద్యులు అనుమానిత కేసులను గుర్తించారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నిర్ధారిస్తారు. అనుమానిత క్యాన్సర్ కేసులను ఉన్నత స్థాయి వైద్య కేంద్రాలకు రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ రోగ నిర్ధారణ కోసం వైరల్ మార్కర్స్ మరియు మరిన్ని పరీక్షలు ఉన్నాయి. నిర్ధారణ అయిన వారిని ప్రివెంటివ్ అకాలజీ యూనిట్ కు రిఫర్ చేస్తున్నారు. అంకాలజీ యూనిట్ స్థాయిలో సూపర్ స్పెషలిస్ట్ సమక్షంలో రోగ నిర్ధారణ చికిత్స అందించారు. వివిధ దశల్లో జరిగే ఈ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలంతా ఉపయోగించుకొని క్యాన్సర్ రహిత సమాజం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి సహకారాన్ని అందించాలని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

కొత్త రేషన్ కార్డులపై పంపిణీపై కీలక అప్‌డేట్.. గ్రామ సభల్లో దరఖాస్తుకు అవకాశం
ఆరోగ్యకరమైన పళ్ల కోసం ఈ ఆహార పదార్థాలు ట్రై చేయండి..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by Page Perfect Tech