విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)గారు స్వర్గస్తులయ్యి నేటికీ 29 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ హైదరాబాదులోని ఫిలింనగర్ లో కృష్ణ అవతారంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు రామారావు గారికి నివాళులు అర్పించి ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ”నేను ఎన్టీఆర్ గారికి అభిమానిని మాత్రమే కాదు, పరమ భక్తుడిని కూడా. ఆయన మనిషి రూపంలో ఉన్న దైవం.నమ్ముకున్న వారెవరిని కూడా ఎన్టీఆర్ వదులుకోలేదు.వాళ్లంతా ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు.అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. సినిమాకి మాటలు రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.ఇంటికి వెళ్తే కడుపునిండా భోజనం పెట్టి పంపించేవారు.అలాంటి
వ్యక్తి అభిమానిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను.సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు.మరోసారి అన్నగారు తెలుగు గడ్డమీద పుట్టి,మరోసారి తెలుగు వారి స్థాయిని పెంచాలని కోరుకుంటున్నాను అని చెప్పడం జరిగింది.
ఒకప్పటి హీరో నిర్మాత మాదాల రవి మాట్లాడుతుంటాడు”దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఈరోజు తెలుగువారి గురించి మాట్లాడుతున్నారంటే దానికి ముఖ్య కారణం నందమూరి తారక రామారావు గారు. పోరాటం అన్నాడు.
ఎన్టీఆర్ మనవరాలు నందమూరి రూపములో మాట్లాడుతు ” ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మనమందరం ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము.ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఎప్పటికైనా మన ఆలోచనల్లో ఉంటారు.ఆయన మరణం లేని వ్యక్తి పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించిన ఏకైక వ్యక్తి.తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోని ప్రభుత్వాన్ని స్థాపించిన వ్యక్తిగా నిలిచాడు.ప్రజలకు అత్యవసరమైన కూడు, గుడ్డ, నీడను అందరికీ అందేలా చేశారు.ఒక నటుడిగా,రాజకీయ నాయకుడిగా కూడా ప్రజల శ్రేయస్సు కోరుకునే ఒక మహానుభావుడిగా ప్రజలు ఎక్కువగా గుర్తు చేసుకున్నారు ఆయన అడుగుజాడల్లోనే నడవాలని కోరుకుంటున్నానని చెప్పింది
ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహన్ కృష్ణ గారు మాట్లాడుతూ “ఈరోజు నాన్నగారి 29వ వర్ధంతి జరుపుకుంటున్నాం. భౌతికమైన మన మధ్య లేకపోయినా ఆయన ఆత్మ మాత్రం మన చుట్టూనే ఉంటుందని, సూర్య చంద్ర ఉన్నంతకాలం ఆయన పేరు ఎన్నో నిలిచిపోతుంది. ఆయన సినీ రంగంలో కూడా పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు వారి సత్తా చూపించారు అదృష్టంగా భావించాలి. ఈ సందర్భంగా ఎక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు” అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మాట్లాడుతూ “స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఫిలింనగర్‌లో ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్నందుకు అందరికీ పేరుపేరునా నమస్కారం. పెట్టుకునిగల బాధ్యతలు అప్పగించడం జరిగింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హైదరాబాదులో ఎంతో అభివృద్ధి చెందింది ఉండి ఆ రోజుల్లో దేశం మొత్తం తిడుతున్న వ్యక్తి ఆయన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. అలాగే ఎన్టీఆర్ గారికి భారతరత్న వచ్చేందుకు మనమంతా పడటం చేయాలి.
తెలుగు చిత్ర నిర్మాత మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న గారు మాట్లాడుతూ… “తెలుగువారింటనే చిన్న చూపు చూసే రోజుల్లో కేవలం 9 నెలల రాజకీయ పార్టీ పెట్టి అధికారాన్ని కైవసం చేసుకుని తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. పొట్టి శ్రీరాములు గారి తర్వాత తెలుగువారు ఒక ప్రభంజనంలా వెలుగెత్తడానికి కారణం ఎన్టీఆర్. ఇప్పుడు పని చేసిన వాళ్ళు వచ్చిన ఏమో కానీ ఆయన ఆరో సినిమా పాతాళ భైరవి ఆ రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో 175 రోజులు ఆయన జీవితం అంతా తెలుగువారికి అంకితం చేసిన మహానుభావుడు, అలాగే శివైక్యం చేసారు. ఎన్టీఆర్.ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో పథకాలను ఆయన ప్రవేశ పెట్టడం జరిగింది 29 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆయన మరణం లేని వ్యక్తి” అంటూ ముగించారు.